రైల్వే శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 374 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదో తరగతి పాసైన అభ్యర్థులు, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 15వ తేదీలోగా నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు యూపీలోని బనారస్ లోకోమోటివ్ వర్క్స్ లో పని చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. http://www.blwactapprentice.in/ లేదా https://blwactapprentice.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఈ వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం 374 ఉద్యోగాలలో నాన్ ఐటీఐ ఉద్యోగాలు 74, ఐటీఐ ఖాళీలు 300 ఉన్నాయి. నాన్ ఐటీఐ ఉద్యోగాలలో ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉద్యోగాలలో ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
పదో తరగతి కనీసం 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు, ఐటీఐ ఉద్యోగాలకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…