కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిందని అనుకునే లోపు కొత్తరకం కరోనా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. యూకే నుంచి ఏపీకి వచ్చిన మహిళకు తాజాగా కరోనా నిర్ధారణ అయింది. అయితే సదరు మహిళకు సాధారణ కరోనా సోకిందా లేక కొత్తరకం కరోనా సోకిందా తెలియాల్సి ఉంది. యూకే నుంచి ఒక మహిళ ఢిల్లీకి రాగా అధికారులు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ మహిళను క్వారంటైన్ కు తరలించారు.
అయితే క్వారంటైన్ నుంచి తప్పించుకున్న మహిళ ఏపీ ఎక్స్ ప్రెస్ ద్వారా రాజమండ్రికి వచ్చింది. ఢిల్లీ అధికారులు ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వగా అధికారులు ఆ మహిళను, మహిళ కుమారుడిని గుర్తించి రాజమండ్రిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య శాఖ అధికారులు ఆమె బ్లడ్ శాంపిల్స్ ను పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపడానికి చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో రాజమండ్రి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అధికారులు సైతం అప్రమత్తమే కరోనా వైరస్ విషయంలో చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ వెబ్ పోర్టల్ లో వివరాలను నమోదు చేసుకుంటే మాత్రమే బ్రిటన్ నుంచి ఏపీకి వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో 21 వేల బృందాల ద్వారా బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి సంబంధించిన వివరాలను సేకరిస్తోందని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక హెల్ప్ లైన్ డెస్కుల సహాయంతో అధికారులు పరీక్షలు నిర్వహించి కరోనా సోకిన వారి వివరాలను సేకరిస్తున్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి కరోనా నెగిటివ్ వచ్చినా 14 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…