Featured

Yandamuri Veerendhranath : మృగరాజు సినిమా వల్ల అతను ఆర్థికంగా నాశనం అయ్యాడు… నేను రామ్ చరణ్ ను కామెంట్ చేసినందుకు చిరంజీవి హర్ట్ అయ్యాడు..: యండమూరి వీరేంద్రనాథ్

Yandamuri Veerendhranath : తెలుగులో నవలా రచయితగా ఎన్నో ఫేమస్ నవలలను రాసిన వ్యక్తి యండమూరి గారు. వెన్నెల్లో ఆడపిల్ల, రాక్షసుడు, మరణ మృదంగం, తులసీదళం వంటి ఎన్నో నవలలను రాసిన ఆయన అప్పట్లో పాఠకులను ఆయన కలంతో ప్రభావితం చేశారు. ఆయన ఎన్నో నవలలు సినిమాలుగా వచ్చి హిట్ అందుకున్నాయి. ఇక వ్యక్తిత్వ వికాసానికి సంబంధిచిన ఎన్నో ఉపన్యాసాలను ఆయన పలు విద్యాసంస్థల్లో ఇస్తూ ఎంతో మందిని ప్రభావతం చేశారు. ఇక సినిమాల్లో కథను అందించ్చేవరకే నా పాత్ర ఇక సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పే యండమూరి గారు పలు అంశాల మీద తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

చరణ్ ను అన్నందుకు చిరంజీవి హర్ట్ అయ్యాడు…

చాలా సందర్భాల్లో యండమూరి చెప్పిన విషయం ఆయన నవలలో హీరో ఎపుడూ చిరంజీవి అని. చిరంజీవి ని హీరోగా అనుకునే కథలను రాస్తాను అంటూ చెబుతారు. ఆయన నవలలో కొన్ని చిరంజీవి హీరోగా సినిమాలు వచ్చి హిట్ అయినవి ఉన్నాయి. ఇక చిరంజీవి తో మంచి సంబంధాలు ఉన్న యండమూరి గారు ఒకానొక సందర్భంలో రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్స్ వల్ల చిరంజీవి హర్ట్ అయ్యాడని చెప్పారు. ఇక ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు కూడా ఇప్పుడు వద్దు రాజకీయ పార్టీ ముందు సేవ చేసి జనాల్లోకి వెళ్ళు అని చెప్పిన వారిలో నేనూ ఉన్నాను అంటూ యండమూరి గారు వివరించారు.

ఇక సినిమాల గురించి మాట్లాడుతూ నిర్మాత దేవి వర ప్రసాద్ గురించి మాట్లాడుతూ ‘మృగరాజు’ సినిమా వల్ల దేవి వర ప్రసాద్ కోలుకోలేని దెబ్బ తిన్నడంటూ తెలిపారు. ఇంగ్లీష్ సినిమా ఇన్స్పిరేషన్ తో వచ్చిన ఆ సినిమాలో గుణశేఖర్, నాగబాబు ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేయగా నేను కేవలం కొన్ని సన్నివేశాలకు మార్పులు చేర్పులు చేయించాను అంటూ చెప్పారు యండమూరి, ఆ సమయంలో నా కొడుకు పెళ్లి కోసం డబ్బు అవసరం అయితే చిరంజీవి దేవి వరప్రసాద్ తో ఇప్పించాడు. నేను సినిమాకు కొన్ని సన్నివేశాలు చెప్పాను అంటూ కానీ ఆ సినిమా అంచాలను తప్పింది, దీంతో దేవి వరప్రసాద్ ఆర్థికంగా దెబ్బతిన్నాడు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago