Nagababu: ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈయన సోషల్ మీడియా వేదికగా మా పక్కనే ఉంటూ పగవాడికి సహాయపడేవాడు మా వాడైనా పరాయి వాడే మా చెంత ఉంటే పరాయివాడైనా మా వాడే అంటూ ఒక పోస్ట్ చేశారు.
ఈ పోస్టు వెనక ఆంతర్యం ఏమిటి అనేది అంతుచిక్కలేదు ఈయన పరోక్షంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారా లేకపోతే పిఠాపురం టిడిపి అభ్యర్థి వర్మను ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారా అనేది తెలియదు కానీ మొత్తానికి ఈయన అల్లు అర్జున్ టార్గెట్ చేశారని అందరూ భావిస్తున్నారు. అల్లు అర్జున్ పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కి కాకుండా వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలియజేస్తున్న నంద్యాలలో పర్యటించారు.
ఈ విధంగా నంద్యాలలో పర్యటించడం వల్లే నాగబాబు ఇలాంటి పోస్ట్ చేశారని అర్థమవుతుంది. అయితే ఈ విషయంపై నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్పందించారు. నాగబాబు గారు ఇలాంటి ట్వీట్ చేశారు అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియదు ఒకవేళ బన్నీని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసి ఉంటే అది ఆయన సంస్కారానికి వదిలేస్తున్నామని తెలిపారు.
వారి సంస్కారానికే వదిలేస్తున్నా..
అల్లు అర్జున్ కేవలం నాతో ఉన్నటువంటి స్నేహబంధం తోనే ఇక్కడికి వచ్చారని తెలిపారు.అంతేకాకుండా ఓటింగ్ రోజు బన్నీ చాలా క్లియర్ గా తెలిపారు. నేను పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తాను అలాగే నా స్నేహితులకు కూడా మద్దతు ఇస్తాను నాకు పార్టీలతో సంబంధం లేదు వారు ఏ రంగంలో ఉన్నా కూడా నా సపోర్ట్ వారికి ఉంటుందని క్లియర్ గా చెప్పారు అయినప్పటికీ కూడా ఇలా పరోక్షంగా కామెంట్లు చేయడం వారి సంస్కారాన్ని తెలియజేస్తుంది అంటూ శిల్పా రవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
https://www.facebook.com/reel/3389452918017833
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…