Serial Artists: సినిమాలలో నటించే హీరోయిన్లకే కాదు బుల్లితెరపై సీరియల్స్ లో నటించే హీరోయిన్లకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది.ఈక్రమంలోనే ప్రతిరోజూ ఎన్నో సీరియల్స్ ద్వారా పలువురు తారలు బుల్లితెర ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తూ ఉన్నారు.ఒక రకంగా చెప్పాలంటే సినిమా హీరోయిన్ల కన్నా సీరియల్ హీరోయిన్ లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. అదేవిధంగా వీరికి రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుతుందని చెప్పాలి.
వెండితెర హీరోయిన్లకు సినిమాకు ఇంత అని రెమ్యూనరేషన్ ఇస్తారు. అయితే బుల్లితెర హీరోయిన్ కి అలా కాదు వీరికి రోజువారి కాల్షీట్స్ ఆధారంగా పారితోషకం అందిస్తారు. ఈ విధంగా బుల్లితెర నటీమణులకు ఒక్క రోజుకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ బాగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం బాగా పాపులారిటీ సంపాదించుకున్న బుల్లితెర హీరోయిన్ ఎవరు ఎంతలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసుకుందాం..
కార్తీకదీపం సీరియల్ ద్వారా అందరికీ ఎంతో సుపరిచితమైన నటి ప్రేమి విశ్వనాథ్ తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఈమె ఒక రోజు షూటింగ్ లో పాల్గొంటే 30 వేల రూపాయల పారితోషికం తీసుకుంటారు. అదేవిధంగా వదినమ్మ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన సుజిత ఒక రోజుకు 25 వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు.
ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్ గా సందడి చేసిన సీనియర్ నటీమణులు ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ కస్తూరి ప్రస్తుతం బుల్లితెరపై గృహలక్ష్మి సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈమె ఒక రోజుకు 25 వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా రాశి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈమె ఒక్క రోజుకు 25 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారు.
చంటిగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం బుల్లితెర హీరోయిన్ స్థిరపడిన సుహాసిని ఒక రోజు కాల్షీట్ కోసం ఈమె 25 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అదేవిధంగా నవ్య స్వామి 25 వేలు, మేఘన లోకేష్ 20 వేలు, అగ్నిసాక్షి ఐశ్వర్య 20 వేలు, కార్తీక దీపం విలన్ శోభా శెట్టి ఒక రోజుకు 15 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఈ విధంగా బుల్లితెర నటీమణుల రోజుకు భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…