Varun Sandhesh : శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో 2007 సంవత్సరంలో తెలుగు సినిమాకు పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్ సినిమాలో తమన్నాకు జోడిగా చందు పాత్రలో ఒదిగిపోయాడు. ఆ తరువాత 2008 లో వచ్చిన కొత్త బంగారంలోకం సినిమా ద్వారా మరోసారి హిట్ కొట్టాడు. వరుసగా మంచి హిట్స్ అందుకున్న వరుణ్ సందేశ్ కథలను సరిగా ఎంచుకోక పోవడం వల్ల ఆ తరువాత పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. ఇక సినిమా కెరీర్ ను వదిలేసి మళ్ళీ అమెరికా వెళ్లిపోయిన వరుణ్ మళ్ళీ సినిమాల్లోకి రే ఎంట్రీ ఇచ్చాడు.
మోహన్ బాబు గారు అలాంటి వారు…..
వరుణ్ సందేశ్ పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో కలిసి నటించిన వితికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక సోలో హీరోగానే కాకుండా సహాయక పాత్రలో కూడా వరుణ్ కనిపించాడు. మోహన్ బాబు ఆయన కుమారులతో కలిసి నటించిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో వరుణ్ నటించాడు. ఇక ఆ సినిమాతో మోహన్ బాబు గారితో పరిచయమేర్పడి ఆయన గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. వరుణ్ సందేశ్ పెళ్ళికి రానందుకు మోహన్ బాబు స్వయంగా ఆయన స్టాఫ్ తో వచ్చి కొత్త జంటకు విష్ చేశారట. మోహన్ బాబు గారిలాంటి గొప్ప వ్యక్తి అలా రావడం చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన చెప్పారు. పాండవులు పాండవులు తుమ్మెద తరువాత నువ్వు తోపురా సినిమాలో వరుణ్ నటించాడు. సుధాకర్ కోమాకుల కోసం మాత్రమే ఆ సినిమా చేసానని వరుణ్ చెప్పాడు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల నువ్వు తోపురా సినిమా లో హీరో. వరుణ్ సందేశ్, సుధాకర్ మంచి స్నేహితులవ్వడం వల్ల ఆ సినిమాలో చేసానని వరుణ్ చెప్పాడు. ఇక తన లైఫ్ పార్టనర్ వితిక గురించి మాట్లాడుతూ తానొక సూపర్ విమెన్ అని లైఫ్ లో తనకు నాకు చాలా ధైర్యాన్నిచ్చింది అంటూ చెప్పాడు. బిగ్ బాస్ తరువాత వితిక చాలా బాధపడిందని నెగెటివ్ కామెంట్స్ వల్ల కొన్నిరోజులు బాధపడిందని చెప్పారు. ఇక తన వల్ల నా మైండ్ సెట్ చాలా మారిందని, నా లైఫ్ లో చేంజ్ వచ్చిందంటూ చెప్పాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…