Categories: FeaturedGeneral News

పత్రాలు అడిగినందుకు పోలీసునే కారుతో ఈడ్చుకుంటూ పోయాడు.. షాకింగ్ వైరల్ వీడియో..!!

కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ కొంత మంది మాత్రం ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా బయట తిరుగుతున్నారు. ఇంట్లో కూర్చొని ఉండలేక ఏ పని లేకుండా తిరుగుతున్నారు. తాజాగా జరిగిన ఒక సంఘటన అందరిని షాక్ కి గురిచేస్తుంది. పత్రాలు అడిగినందుకు ఏకంగా పోలీసునే కారుతో ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు.

వివరాల్లోకి వెళితే… పంజాబ్ రాష్ట్రం జలంధర్ సమీపంలోని మిల్క్ బార్ చౌక్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో అటు ఒక కారు రావడంతో ఏఎసై ముల్క్ రాజ్ ఆ కారును ఆపి పత్రాలు చూపించమని అడిగారు. ఆ సమయంలో ఏఎస్సై కారు బానెట్ పై చేతులు పెట్టి అడ్డగా నిలిచిని అడిగారు. దీనితో ఆ కారు డ్రైవర్ ఎలాగైన తప్పించుకోవాలని ఆ కారును వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. ఆ కారు ముందున్న ఏఎస్సై కూడా కారు బానెట్ పై ఉండిపోయారు. అయినా సరే పట్టించుకోకుండా అలాగే ఈడ్చుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు.

అయితే జరుగుతన్న విషయాన్నీ గమనించిన స్థానికులు ఆ కారును ఆపి, డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనలో ఏఎస్సై కు స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది. అక్కడే ఉన్న ఒక యువకుడు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ప్రేమించి పెళ్లి… చివరకు భర్త హత్య! హోలోగ్రామ్‌తో బయటపడిన షాకింగ్ కుట్ర

ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…

3 hours ago

అషు రెడ్డి-టెక్కీ వివాదంలో ఆడియో బాంబ్

బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…

3 hours ago

ఒక్క ఛాన్స్ కోసం తిరిగిన సత్యరాజ్.. కట్టప్పగా వరల్డ్ ఫేమ్

దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…

3 hours ago

“ఆ హీరో నా జీవితంలో గాడ్ ఫాదర్”.. అనుష్క ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…

3 hours ago

“వినాశకాలే విపరీత బుద్ధి”.. యువతకు కఠిన హెచ్చరిక

ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…

4 hours ago

మోదీని డైరెక్ట్‌గా కలుస్తా.. మంచు లక్ష్మి రాజకీయ వ్యాఖ్యలు వైరల్

టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…

6 hours ago