ఉద్యోగం చేసే వారు దాదాపు 80 శాతం మందికి ఈపీఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది. నెలకు వారి యొక్క శాలరీని బట్టి 12 శాతం డబ్బులను కట్ చేస్తూ తమ పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తూ ఉంటారు. అయితే ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేయడం ద్వారా కోటీశ్వరులు కూడా కావొచ్చు. అదెలా అంటే.. ప్రస్తుతం పీఎఫ్ అకౌంట్లో ఈ నెలాఖరులోగా 8.5 శాతం వడ్డీ వారి వారి అకౌంట్లలో జమ కానుుంది.
ఇదే స్థాయిలో వడ్డీ వస్తే ఈపీఎఫ్ అకౌంట్ లక్షలు కాదు కోట్లు కూడబెట్టొచ్చని పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్ లెక్కలు చెబుతున్నారు. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు కోటీశ్వరుడు కావాలంటే తక్కువ వయస్సు నుంచే ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తూ ఉండాలి. మధ్యలో ఎలాంటి అవసరం వచ్చినా విత్ డ్రా అనేది చేయకుండా ఉండాలి.
బేసిక్ శాలరీ ఎక్కువగా ఉండే వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఉంటే రిటైర్మెంట్ నాటికి ఈపీఎఫ్ అకౌంట్‌లో కోటి రూపాయల పైనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉద్యోగి వేతనంలో 12 శాతం యాజమాన్య వాటా, 12 శాతం ఉద్యోగి వాటా ఈపీఎఫ్ అకౌంట్‌లో ప్రతీ నెల జమ అవుతుందన్న సంగతి తెలిసిందే. ఇలా ప్రతీ నెల జమ చేస్తూ ఉంటే కోటి రూపాయల పైనే కూడగట్టొచ్చని తత్వం అండ్ కో స్ట్రెసెస్ ఫౌండర్ పార్ట్‌నర్ పీతమ్ గోయల్ వివరించారు.
21 ఏళ్ల వయస్సులో ఓ వ్యక్తికి రూ.2,10,000 ప్యాకేజీతో జీవితం మొదలుపెడితే.. వార్షిక ఇంక్రిమెంట్ 8 శాతం చొప్పున ఉంటే రిటైర్మెంట్ నాటికి రూ.2 కోట్లు జమ అవుతాయి. వడ్డీతో లెక్కేసుకుంటే ఏకంగా రూ. 2.42 కోట్ల వరకు జమ అవుతాయి. రూ.25,000 బేసిక్ వేతనం ఉన్న వ్యక్తి 35 ఏళ్లలో రూ.1.65 కోట్లు కూడబెట్టొచ్చని తెలిపారు. ఇలా పీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్లు కోటీశ్వరులు కావచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…