Featured

Youtuber 4 crores gifts : యూట్యూబర్ పెళ్ళికి నాలుగు కోట్ల చదివింపులు… పండగ చేసుకుంటున్న కొత్త జంట… కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది….!

Youtuber 4 crores gifts : యూట్యూబ్ పుణ్యమా అని ఇప్పుడు సామాన్యుడు కూడా సెలెబ్రిటీ అయిపోయాడు. కంటెంట్ నచ్చితే చాలు ఫాలోయర్స్ పెరిగిపోతారు. క్రియేటివ్ గా ఆలోచించే వారు ఎవరైనా సరే మేము అందరిస్తామంటారు నెటిజన్స్. అందుకే ఇప్పుడు యూట్యూబ్ లో ఛానెల్ ను సాధారణ జనం మాత్రమే కాదు ఎంతటి సెలబ్రిటీ అయిన ఒక ఛానెల్ పెట్టుకుని అందులో తమకు సంబంధిచిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇలా యూట్యూబ్ ఛానెల్ పెట్టి లక్షల్లో ఫాలోయర్స్ ను పెంచుకున్న సురేష్ అనే యువకుడు తన వీడియోలతోనే కాదు ఇప్పుడు తన పెళ్లి తో కూడా వైరల్ అవుతున్నాడు.

పెళ్ళికి చదివింపులు నాలుగు కోట్లు….

సురేష్ తన గ్రామంలోని వ్యక్తులనే నటులుగా మార్చి ఊర్లో జరిగే విషయాలకు ఫన్ జోడించి వీడియోలను తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసేవాడు. అలా లక్షల్లో ఫాలోయర్స్ ను పెంచుకున్నాడు సురేష్. సురేష్ కు మరో పేరు కూడా ఉంది అదే శ్రీ. క్రియేటివ్ థింక్ పేరిట యూట్యూబు ఛానెల్ పెట్టి అందులో మంచి కంటెంట్ తో జనాలను ఆకట్టుకున్నాడు. ఇక అతను మౌనిక అనే అమ్మాయిని సింపుల్ గా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి ముచ్చట ను వీడియో రూపంలో ఆయన ఫాలోయర్స్ కోసం యూట్యూబు ఛానెల్ లో పెట్టిన శ్రీ మరో వినూత్న ఆలోచనతో తన పెళ్లి ముచ్చట్లను చెబుతూ చేసిన వీడియోలో చదివింపులు చేయండని తన ఫాలోయర్స్ ను కోరాడు.

షాక్ అయిన ఫాలోయర్స్ మన యూట్యూబర్ అని చదివింపులకు సిద్ధమై ఏకంగా నాలుగు కోట్ల 83 లక్షల చదివింపులు చదివించారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే శ్రీ తన పెళ్ళికి చదివించమన్న చదివింపులు పే టీఏం లోనో గూగుల్ పే లోనూ పంపమని చెప్పలేదు. తన వీడియో కింద కామెంట్స్ లో ఎంత చదివించాలనుకుంటున్నారో చదివించండి అంటూ చెప్పాడు. క్రేజీ గా వచ్చిన ఈ ఐడియా కు రెస్పాన్స్ కూడా అదిరింది. తన ఫాలోయర్స్ కామెంట్స్ లో చదివించిన మొత్తం డబ్బులను లెక్కపెట్టి మొత్తం నాలుగు కోట్ల 83 లక్షలు అయినట్లు శ్రీ కామెంట్ పిన్ చేసాడు. విషయం తెలియని కొంతమంది ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లెమ్ వస్తుంది చూసుకో అంటూ సలహా ఇస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago