YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా రోడ్డు షోలు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే నేడు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈయన కోరుకొండ రోడ్డు షోలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు పరిచే దిశగా కొన్ని బటన్లో నొక్కారు. అయితే ఎన్నికలకు సమయం దగ్గరపడి నోటిఫికేషన్ రావడంతో సంక్షేమ పథకాలు అమలులో భాగంగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ కాలేదు. అయితే ఈ విషయం గురించి జగన్మోహన్ రెడ్డి ఈసీకే లేఖ రాశారు. సంక్షేమ పథకాలు అమలులో భాగంగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ చేయడానికి వీలు కల్పించాలని కోరారు కానీ ఈసీ అందుకు అనుమతి ఇవ్వలేదు.
ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను ఆపడం కోసం ఢిల్లీ పెద్దలతో కలిసి కుట్రలు చేశారని ఆరోపణలు చేశారు. ప్రజలకు మంచి జరగకుండా కుట్రలు చేశారు. ఇప్పుడు ఢిల్లీ పెద్దలతో కలిసి సంక్షేమ పథకాలను అడ్డుకోవచ్చు కానీ మీ బిడ్డ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు అంటూ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కూటమినేతలలో భయం..
జూన్ 4వ తేదీ పెండింగ్లో ఉన్న బటన్లు అన్నింటిని నొక్కి మీ ఖాతాలలో డబ్బులు జమ అయ్యేలా చూస్తామని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే రోడ్డు షోలలో భాగంగా అలాగే ప్రచార కార్యక్రమాలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి కూటమి
నేతలలో ఓటమి భయం పట్టుకుందని ఈ ఓటమి భయం కారణంగానే మంచికి అడ్డుకట్టలు వేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…