YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తాడేపల్లిలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు పై ఈయన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ముఖ్యంగా కొంతమంది ఐ టీడీపీ బ్యాచ్ తో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి తన తల్లి గురించి చెల్లి షర్మిల అలాగే తన పట్ల చేస్తున్నటువంటి పోస్టులపై ఈయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు తన ఐ టిడిపి బ్యాచ్ తో ఇలా ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయించి తన కుటుంబం గురించి ఎంతో అసభ్యకరంగా పోస్టులు చేయిస్తున్నారు. బాలకృష్ణ చేత తన చెల్లి పై తప్పుడు ప్రచారాలను కూడా చేయించారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నీకు కూడా ఓ కుటుంబం ఉంది కదా అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా తన తల్లిదండ్రులను ఈ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయలేదు కనీసం వారిని ఒక్క పూటైనా నీ ఇంటికి పిలిచి కడుపునిండా భోజనం పెట్టవా మీ తల్లిదండ్రులు చనిపోతే వారికి తలకొరివి కూడా పెట్టలేదు అంటూ మండిపడ్డారు. ఇక అక్రమంగా సోషల్ మీడియా వైసిపి కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని వెల్లడించారు. ఇక వర్మ సెన్సార్ బోర్డు అనుమతి తీసుకుని సినిమా చేశారని ఈయన గుర్తు చేశారు.
ఆయన సినిమా చేయడానికి సెన్సార్ బోర్డు అనుమతి ఉంది. ఇప్పుడు తనపై కూడా కేసులు పెడుతున్నారని జగన్ గుర్తు చేశారు. కేవలం మీ టీడీపీ ఎల్లో బ్యాచ్ చేసినవే సినిమాలా అంటూ కూడా మండిపడ్డారు. ఇలా జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్స్ హామీల గురించి అలాగే తమ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఉన్న అప్పుల గురించి ఇక ప్రస్తుతం ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తల గురించి కూడా మండిపడుతూ చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వానికి వరుస ప్రశ్నలు వేశారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…