General News

నిరుద్యోగులకు శుభవార్త.. స‌ద‌ర‌న్ రైల్వేలో 2,652 అప్రెంటిస్ ఉద్యోగాలు..షేర్ చేయండి..

Published

on

సదరన్ రైల్వే తమిళనాడులో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలచేసింది. పొడనూర్‌లోని స్నిగల్, టెలికాం వర్క్‌షాప్ వివిధ డిపార్ట్‌మెంట్లలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. సదరన్ రైల్వే 1961 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.
పోస్టు: ట్రేడ్ అప్రెంటిస్

అప్రెంటిస్ చేసే ప్రదేశాలు: పొడనూర్, సేలం, పాల్గాట్, త్రివేండ్రం.

Advertisement

ట్రేడ్ అప్రెంటిస్ మొత్తం ఖాళీల సంఖ్య: 2652 (జనరల్-1 348, ఓబీసీ-705, ఎస్సీ-399, ఎస్టీ-200)

ఖాళీలు విభాగాల వారీగా :
మెషినిస్ట్-57, టర్నర్-30, ఫిట్టర్ – 587, అడ్వాన్స్ వెల్డర్-24, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్)-456, ఎలక్ట్రీషియన్-734,ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-29, డీజిల్ మెకానిక్-104, పెయింటర్-64, కార్పెంటర్-154, ప్లంబర్-108, వైర్‌మ్యాన్-68, రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్-12, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-112, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-20, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)-50, ఫ్రెషర్ ఎంఎల్‌టీ (రేడియాలజీ)-8, ఫ్రెషర్ ఎంఎల్‌టీ (పాథాలజీ)-8 ఖాళీలున్నాయి.

వయస్సు: 2018 ఏప్రిల్ 12 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి. SC,ST లకు ఐదేళ్లు, OBCకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Advertisement

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతితోపాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్/ఐటీఐ (ఫిట్టర్, మెషినిస్ట్,మెకానిక్, ఎలక్ట్రీషియన్,టర్నర్, ఎలక్ట్రానిక్స్ ప్లంబర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-20, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) ట్రేడ్‌లో ఉత్తీర్ణత. కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, వైర్‌మ్యాన్‌లకు 8వ తరగతితోపాటు సంబంధిత ITIలో ఉత్తీర్ణత. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు ఇంటర్/10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)లో ఉత్తీర్ణత.

స్టైఫండ్ : సదరన్ రైల్వే అప్రెంటిస్ కౌన్సిల్ నిర్ణయించిన విధంగా ట్రైనింగ్ సమయంలో అప్రెంటిస్ యాక్ట్ 1992 ప్రకారం స్టయిఫండ్ చెల్లిస్తారు.

అప్లికేషన్ ఫీజువివరాలు: జనరల్/OBC అభ్యర్థులు రూ. 100/-, SC,ST, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.

Advertisement

ఎంపిక విధానం: 10వ తరగతి,ITIలో వచ్చిన మార్కుల ఆధారంగా (50:50) ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పూర్తిచేసి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.

పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Work Shop Personnel Officer,
Office of the Chief Work Shop
Manager, Signal and
Telecommunication Work Shop,
Southern Railway – Podanur,
Coimbatore Dist, Tamil Nadu

Advertisement

దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 11

వెబ్‌సైట్: http://www.sr.indianrailways.gov.in/

Advertisement

Trending

Exit mobile version