Category Archives: Reviews

Lambasingi Movie Review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

దర్శకుడు నవీన్ గాంధీ దర్శకత్వంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి భరత్ రాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా లంబసింగి. ఈ సినిమా మార్చి 15న విడుదల అయింది. బంగార్రాజు, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల దర్శకుడు కృష్ణ కొరసాల ఈ సినిమా ద్వారా నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. కాన్సెప్ట్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందంటే..

కధ : వీరబాబు( భరత్ రాజ్) కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన తర్వాత లంబసింగిలో డ్యూటీ పడుతుంది. ఊర్లోకి వస్తూనే హరిత ( దివి ) ని చూసి ప్రేమలో పడతాడు. అయితే అదే ఊరిలో మాజీ నక్సలైట్స్ కి పునరావసం కల్పిస్తుంది ప్రభుత్వం, అందులో హరిత తండ్రి కూడా ఒకరు. అలాంటి వాళ్లతో రోజూ సంతకాలు తీసుకునే డ్యూటీ పడుతుంది వీరబాబుకి. హరితతో ప్రేమలో పడటానికి ఇదే అదునుగా భావించిన వీరబాబు హరిత ఇంటికి రాకపోకలు సాగిస్తాడు.

ఒకరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడటం కోసం హరిత, వీరబాబు మరింత దగ్గరవుతారు. అదే క్రమంలో ఒకరోజు తన ప్రేమను గురించి దివికి చెప్తాడు కానీ ఆమె అంగీకరించదు. అయితే ఒకరోజు డ్యూటీలో ఉన్న వీరబాబు మీద దాడి చేసి నక్సలైట్లు ఆయుధాలు తీసుకువెళ్లి పోతారు. అదే సమయంలో అతనికి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏమిటి? హరిత వీరబాబు ప్రేమని కాదనటానికి కారణాలు ఏమిటి అనేది సినిమా.

విశ్లేషణ : దర్శకుడు ఎంపిక చేసుకున్న పాయింట్ ని యధావిధిగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే మొదటి భాగం కొంచెం లాగ్ అనిపించినా తర్వాత కథ లో క్యూరియాసిటీ చోటు చేసుకుంటుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయలేనిదిగా ఉంటుంది. స్క్రీన్ ప్లే డిజైన్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యాడు డైరెక్టర్.

సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ సినిమాకి ఆర్ ఆర్ దృవన్ సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. విజయవర్ధన్ కావూరి ఎడిటింగ్ కూడా సినిమాకి హైలైట్ అయింది.

నటీనటులు : దివి హరిత పాత్రలో ఒదిగిపోయిందని చెప్పాలి, అలాగే భరత్ కూడా వీరబాబు పాత్రలో న్యాచురల్ గా నటించాడు. వంశీరాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ కూడా సినిమాలో ఒదిగిపోయి నటించారు అనటం కన్నా జీవించారు అనొచ్చు.

చివరిగా: ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు వేరే ప్రపంచంలోకి వెళ్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా చూడదగ్గ చిత్రం ఈ సినిమా.

రేటింగ్: 3/5

“I Hate You” Movie Review : ఆకట్టుకునే రొమాంటిక్ థ్రిల్లర్… “ఐ హేట్ యు”

హీరో కార్తీక్ రాజు… ఈ మధ్యనే అథర్వ సినిమాతో ఓ వైవిధ్యన కథ… కథనంతో అలరించారు. తాజాగా ఇద్దరు టీనేజ్ యువతుల మధ్య ఉండే ‘అబ్సెసివ్ లవ్ డిజార్డర్’ బేస్ తో ‘ఐ హేట్ యు‘ అంటూ ఈ వారం ముందుకొచ్చారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అంజి రామ్ దర్శకత్వం వహించగా… బీలకంటి నాగరాజ్ నిర్మించారు. ప్రభోద్ దామెర్ల కథను అందించారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఓ అనాథాశ్రమంలో పెరుగుతుంది ఇందు(మోక్ష). స్కూల్ లో క్లాస్ మేట్ అయిన సంధ్య(షెర్రీ అగర్వాల్)తో ఆమెకు ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుంది. వీరిద్దరి స్నేహాన్ని చూసి సంధ్య తండ్రి(నటుడు శ్రీనివాస్ రెడ్డి) ఇందుని అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చి… ఇంట్లోనే సంధ్యతో పాటు పెంచుతాడు. అయితే సంధ్య పై చదువులకోసం విదేశాలకు వెళతుంది. సంధ్య విదేశాలకు వెళ్లడం ఇందుకు అసలు ఇష్టం ఉండదు. కొన్నాళ్లకు సంధ్య విదేశాల నుంచి ఇండియాకు తిరిగొస్తుంది. విదేశాల్లో ఉన్నప్పుడే సంధ్య, రాజీవ్(కార్తీక్ రాజు) ప్రేమించుకుంటారు. ఇండియాకు వచ్చిన తరువాత కూడా వీరిద్దరూ కలిసి తిరగడం ఇందు అస్సలు సహించదు. ఈ క్రమంలో ఇందు వీరిద్దరిని విడగొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అసలు ఇందుకు ఉన్న సైకలాజికల్ సమస్య ఏంటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: రొమాంటిక్ థ్రిల్లర్ మూవీస్ ను ఆడియన్స్ మెచ్చేలా తెరమీద చూపించాలంటే.. సరైన ప్లాట్ ఉండాలి. అందుకు తగ్గట్టుగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో స్క్రీన్ ప్లేను నడిపితే.. ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. దర్శకుడు కూడా అలాంటి బలమైన ప్లాట్ తో ఉన్న కథను ఎంచుకున్నారు. ఇద్దరు అందమైన అమ్మాయిల మధ్య ఉండే స్నేహం… చివరకు అబ్సెసివ్ లవ్ డిజార్డర్ గా మారితే… ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేదాన్ని చాలా రొమాంటిక్ గా చూపించారు. ఇది వినడానికి ఎవరికైనా లెస్బియన్ స్టోరీనా అనే అనుమానం వచ్చిందే తడవుగా… దానికి క్లారిటీ కూడా దర్శకుడు ఇచ్చేస్తాడు. ఫస్ట్ హాఫ్ లో ఇద్దరు ఇవతుల మధ్య స్నేహం… సరదా సన్నివేశాలతో టైంపాస్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఇంటర్వెల్ నుంచి అసలైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో స్క్రీన్ ప్లేను పరిగెత్తించారు. రాజీవ్ ను అడ్డు తొలగించేందుకు ఇందు వేసే ఎత్తుగడలన్నీ ఆసక్తికరంగా సాగుతాయి. అయితే… క్లైమాక్స్ మాత్రం ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. మొదట్లో చైల్డ్ హుడ్ లైఫ్ ని ఇంకాస్త ట్రిమ్మింగ్ చేసుంటే కథనం మరింత వేగంగా ఉండేది.

కార్తీక్ రాజు తన మార్క్ స్టైల్ లో ప్లే బాయ్ గా చాలా ఈజ్ తో నటించేశారు. ఇతనికి జోడీగా నటించిన షెర్రీ అగర్వాల్ కూడా గ్లామర్ తో ఆకట్టుకుంది. మోక్ష మాత్రం తన క్యూట్ లుక్స్ తో మొదట్లో అమాయకంగా కనిపించి… ఆ తరువాత తన అసలు పెర్ ఫార్మెన్స్ చూపించి ఆకట్టుకుంది. డ్రగ్ అడిక్టర్ గా ప్రియాంక, ఆమె లవర్ బాయ్ గా రాహుల్ పాత్రలు వైవిధ్యంగా కనిపిస్తాయి. ఈ పాత్రల మధ్యనే మొత్తం కథను… దర్శకుడు రొమాంటిక్ థ్రిల్లర్ గా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది.

ఇలాంటి కథలను తెరకెక్కించాలంటే కొంచెం సాహసంతో కూడుకున్నదే. అలాంటి ప్లాట్ ను ఎంచుకుని… ఎక్కడా బోరింగ్ లేకుండా తెరకెక్కించారు దర్శకుడు. సంగీతం పర్వాలేదు. హీరోయిన్స్ ను అందంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ . బీచ్ లో పాట యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా రిచ్ గా నిర్మించారు. ముఖ్యంగా కాస్టింగ్ ఎంపిక కూడా బాగుంది. లీడ్ రోల్ పోషించిన ముగ్గురు అమ్మాయిలూ బాగున్నారు. లొకేషన్స్ ఎంపికలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్స్ ను ఇష్టపడేవారికి ఈ సినిమా నిరాశ పరచదు. సో… గో అండ్ వాచ్ ఇట్…!!!

రేటింగ్: 3

నెక్రోమాన్సీ అనగా చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం అనే కొత్త కాన్సెప్ట్ వస్తున్నా ధీమహి చిత్రం

ధీమహి చిత్రం ట్రైలర్ విడుదల. అక్టోబర్ 27న విడుదల

కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11PM చిత్రం ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా ‘ధీమహి’. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. ఇందులో నిఖిత చోప్రా హీరోయిన్. షారోన్ రవి సంగీతం అందించారు. ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల అనగా అక్టోబర్ 27న విడుదల కు సిద్ధంగా ఉంది. అయితే ఈరోజు ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను సోషల్ మీడియా విడుదల చేసారు చిత్ర యూనిట్.

అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ “మా ధీమహి చిత్రం ఈ నెల అనగా అక్టోబర్ 27న విడుదల అవుతుంది. అయితే ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను సోషల్ మీడియా విడుదల చేసాం. ట్రైలర్ చాలా బాగుంది అని కామెంట్స్ వస్తున్నాయి. ఈ రెండు నిమిషాల ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచుతుంది. హీరో సాహస్ పగడాల కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇదివరకు 7:11PM చిత్రం తో టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ను మరియు ఇప్పుడు ఆత్మల మార్పిడి కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నాడు. విసుల్స్ మరియు సినిమాటోగ్రఫీ బాగున్నాయి, నెక్రోమాన్సీ అనగా చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం అనే కొత్త కాన్సెప్ట్ ని ఈ చిత్రంలో పొందుపరిచారు. చిత్రాన్ని మొత్తం ఫారిన్ లోనే షూట్ చేసారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో మంచి థ్రిల్లింగ్ అంశాలతో సరికొత్త కథ కథనం తో ఉంటుంది. మా చిత్రం అందరికి నచ్చుతుంది.

7:11 చిత్రం లో నటించిన సాహస్ పగడాల ఈ చిత్రం లో నటించి, స్వీయ దర్శకత్వం వహించారు. మా చిత్రం లోని పాటలు జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేస్తాము. అక్టోబర్ 27న విడుదల చేస్తున్నాం, తప్పక చుడండి” అని తెలిపారు.

చిత్రం పేరు : ధీమహి

నటీనటులు : సాహస్ పగడాల, నిఖిత చోప్రా, విరాట్ కపూర్, జె డి చెరుకూరు, ఆషిక, శ్రీజిత్, గంగాధరన్, సౌజన్య కాసినా, వంశి దావులూరి, తదితరులు

ఎడిటర్ : సంతోష్ కామిరెడ్డి

కెమెరా మాన్ : రహ్ శర్మ

మ్యూజిక్ : షారోన్ రావి

పి ఆర్ ఓ : పాల్ పవన్

డిజిటల్ పి ఆర్ ఓ : వంశి (సినీ డిజిటల్)

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చైతు పడిగల

కో ప్రొడ్యూసర్ : ఎమ్ ఎస్ కార్తీక్, శ్రీధర్ రెడ్డి గూడా

దర్శకులు : సాహస్ పగడాల, నవీన్ కంటె

నిర్మాతలు : విరాట్ కపూర్ , సాహస్ పగడాల

Adipursh Twitter Review ఆదిపురుష్” ట్విట్టర్ రివ్యూ : “ఆదిపురుష్” సినిమా ఎలా ఉందంటే..

Adipursh Twitter Review : ఇండియన్ సినిమా లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చేసింది. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా నటించిన “ఆదిపురుష్” సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 9000కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. ఇక తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా “ఆదిపురుష్” మానియానే.. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ థియేటర్లు లోపల బయట మారుమ్రోగిపోతున్నాయి. ఇప్పటికే ఓవర్సేస్ తో పాటు మన దేశంలో కూడా పలు చోట్ల ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు సోషమ్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. సినిమా ఎలా ఉంది? రాముడిగా ప్రభాస్ ఎలా నటించాడు మొదలుగు విషయాలు ట్విట్టర్ వేదికగా చర్చిస్తున్నారు.

ఇక సినిమాపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తుంది. ప్రభాస్ రాముడిగా యాక్టింగ్ అదిరిపోయిదని అంటున్నారు. కానీ అయనకు స్క్రీన్ స్పెస్ చాలా తక్కువ ఉందని అందువల్ల రాముడిగా ప్రభాస్ మిగిలిన వారితో పోలిస్తే చాలా తక్కువ సమయం కన్పించారనే ఫీలింగ్ కలుగుతందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక దర్శకుడి విషయానికి వస్తే.. రామాయణాన్ని నేటితరానికి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో దర్శకుడు ఓం రౌత్ ఫెయిల్ అయ్యాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని, సెకండ్ హాఫ్ చాలా లెంగ్తీగా ఉండటం వల్ల బోర్ ఫీల్ అవ్వాల్సి వస్తుందని కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు స్టోరీ మొత్త్తం ఫస్ట్ హాఫ్ లోనే చెప్పేయడంతో సెకండ్ హాఫ్ లో చెప్పడానికి ఏమీ లేక సాగదీశాడని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని అంటున్నారు. ఇక VFX అస్సలు బాలేదని వీటికన్నా సీరియల్స్ లో VFX చాలా బెటర్ గా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఓవరాల్ గా సినిమా బాగుందని అందరూ తప్పకుండా సినిమా ఒక్కసారి అయినా చూడాల్సిన సినిమా అంటూ చెబుతున్నారు.

AGENT Twitter Review : అఖిల్ అక్కినేని “ఏజెంట్” మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందో తెలుసా?

Akhil: అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఏజెంట్. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఈరోజు (ఏప్రిల్ 28వ తేదీ)న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక మాస్ ఇమేజ్ కోసం మొదటి సినిమా నుండి ట్రై చేస్తున్నాడు అఖిల్. ఈ నేపథ్యంలో మొదటి సినిమా “అఖిల్” డైరెక్టర్ వివి వినాయక్ తో గ్రాండ్ లాంచ్ చేసినా ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తరువాత “హలో”, మిస్టర్ మజ్ను సినిమాలు చేసినా అవి కూడా అంతంత మాత్రంగా ఆడాయి. ఈ రెండు సినిమాలు లవ్ బాయ్ ఇమేజ్ కొంచెం ఇచ్చినా.. అయన మాత్రం మాస్ ఇమేజ్ కోసమే ట్రై చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో తాజగా డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి స్పై త్రిల్లర్ ఏజెంట్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మళయాళ నటుడు మమ్ముట్టి నటించడం మరో విశేషం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి సాక్షి వైద్య పరిచయం అవుతుంది. “బాస్ పార్టీ” ఫెమ్ ఊర్వశి రహతుల తో ఒక ఐటెం సాంగ్ కూడా చేశారు. ఇప్పటికె విడుదలైన పాటలు, ట్రైలర్స్ ఈ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. అయితే భారీ అంచనాల నడుమ ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్ తో పలు చోట్ల ఫస్ట్ డే షోలు పడిపోయాయి. ఇక ఈ సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు, మరి ఎలా ఉందొ ఒకసారి చూసేద్దామా ?

ఈ సినిమా గురించి ట్విట్టర్ లో మిశ్రమ స్పందన వస్తుంది. అఖిల్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని, కానీ అసలు సినిమాలో కథ సరిగా లేదని అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు అసలు బాలేదని, ఎందుకు పెట్టార్రా బాబు అనిపిస్తున్నాయని అంటున్నారు. అసలు లవ్ ట్రాక్, హీరోయిన్ అస్సలు ఏమి ఉపయోగం లేదని అంటున్నారు. కొందరు ఫస్ట్ హాఫ్ ఓకే అని.. సెకండ్ హాఫ్ అస్సలు బాలేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే అఖిల్ వన్ మెన్ షో చేసాడని సినిమా మొత్తం అఖిల్ తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడని అంటున్నారు.

Yashoda movie twitter review : లేడీ ఓరియెంటెడ్ సినిమాలో సమంత మెప్పించిందా?? యశోద ప్రేక్షకులను ఆకట్టుకుందా?? యశోద సినిమా ట్విట్టర్ రివ్యూ…!

Yashoda movie twitter review : శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక ప్రసాద్ నిర్మించిన ‘యశోద’ సినిమా నవంబర్ 11 న విడుదల అయింది. హరి, హరీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో లీడ్ రోల్ లో సమంత నటించింది. గర్భవతిగా ఉన్న సమంత ఫస్ట్ లుక్ ని మొదట చూపించి సినిమా షూటింగ్ అప్పుడే సినిమా మీద బజ్ పెంచేసింది చిత్ర యూనిట్. సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమంత ఈ సినిమా కోసం బాగా కష్టపడింది. మరి సినిమాకు తన కష్టానికి ఫలితం దక్కిందా… సినిమా విడుదల ఈరోజు అయితే యూఎస్ బాక్స్ ఆఫీస్ లో ఆల్రెడీ బొమ్మ పడింది కాబట్టి చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని పంచుకున్నారు.

డీసెంట్ థ్రిల్లర్…

యశోద మూవీ మీద మొదటి నుండి మంచి ఎక్స్పెక్టేషన్స్ ను ప్రమోషన్స్ ద్వారా చిత్ర యూనిట్ క్రియేట చేసింది. అందుకు తగ్గట్టే సినిమా బాగుంది అనే పాజిటివ్ టాక్ వినపడుతోంది. మొదటి భాగం ఎంగేజింగ్ గా సాగిపోతోంది ఇక సెకండ్ హాఫ్ ఎమోషనల్ డ్రామా గా ఉంటుంది అంటూ ట్విట్టర్ వేదికగా సినిమా గురించి చెప్పేస్తున్నారు. సరోగసీ వైద్యం నేపథ్యంలో సాగే కథలో హత్య జరగడం దాని ఇన్వెస్టిగేషన్ ఇతివృత్తంగా కథ సాగనుంది.

ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు 20 నిముషాలు బాగా ఆకట్టుకుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సమంత తన నటనలో ది బెస్ట్ ఇచ్చిందని, సినిమాను తన నటనతో ఎక్కడికో తీసుకెళ్లిందని అభిప్రాయపడుతున్నారు. సమంత ఇంట్రడక్షన్ కుడా చాలా నార్మల్ గా తీసుకురావడం వల్ల కథలో ఎంగేజ్ అవుతామని, ఇక మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఓవరాల్ గా సినిమా డీసెంట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ అంటూ అభివర్ణిస్తున్నారు. ఇక యశోద సినిమాను ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1350 థియేటర్లలో రిలీజ్ చేశారు. నైజాంలో 195, సీడెడ్ 80, ఆంధ్రా 225, మిగిలిన ఇండియా 600, ఓవర్సిస్ లో 250 థియేటర్లలో విడుదల అయింది.

Virata Parvam Movie Review : విరాటపర్వం సినిమా రివ్యూ….. నక్సలిజం పోరాటంలో అమ్మాయి ప్రేమ కథ ప్రేక్షకులకు నచ్చిందా..?

Virata Pravam : నీది నాది ఒకే కథ సినిమా తీసిన వేణు ఉడుగుల దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. రానా దగ్గుబాటి, సాయి పల్లవి ముఖ్య పాత్రాలలో నటించిన ఈ సినిమా జూన్ 17 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా అనేక వాయిదాలు పడిన ఈ సినిమాను తోలుత ఓటీటీ లో విడుదల చేస్తారని అనుకున్న చివరికి థియేటర్స్ లో విడుదల చేసారు. తూము సరళ అనే ఒక నక్సలైట్ నిజం జీవితంలో జరిగిన కథ ఆధారంగా తీసిన చిత్రం కావడంతో మరింత ఇంట్రెస్ట్ సినిమా మీద కలిగింది. మరి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందామా….

కథంతా వెన్నెల చుట్టూనే….

సాయి పల్లవి మెయిన్ లీడ్ గా నటించిన ఈసినిమాలో కథ మొత్తం వెన్నెల అనే అమ్మాయి ప్రేమ కథగా చెప్పొచ్చు. పోరాటాల నడుమ పుట్టిన చిన్నారి సాయి పల్లవి, వెన్నెల (సరళ పేరును మార్చారు ) ప్రేమ కథ ఈ సినిమా. నక్సలైట్లకు, పోలీసులకు మధ్య కాల్పుల సమయంలో తల్లి ఈశ్వరి రావు కి పుడుతుంది ఇక సాయి పల్లవికి వెన్నెల అని పేరు పెట్టేది కూడా ఒక మహిళ నక్సలైట్ (నీవేదా పితురాజ్ ). పెరిగి పెద్దయ్యాక వెన్నెల నక్సలైట్ అరణ్య అలియాస్ రవన్న పుస్తకాలు చదివి అతన్ని చూడకుండానే ప్రేమలో పడుతుంది. రవన్న ( రానా దగ్గుబాటి ) దళ సభ్యుడు. ఈ విషయంలో తెలియని వెన్నెల తల్లిదండ్రులు ఈశ్వరిరావు, సాయి చందర్ మేన బావ రాహుల్ రామకృష్ణ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఇక వెన్నెల రవన్న ను ఇష్టపడుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి రవన్న కోసం ఇంటికి నుండి వెళ్ళిపోతుంది. ఇక తాను రవన్నను ఎలా చేరింది, తన ప్రేమను చెప్పి కన్విన్స్ చేసింది అనేది కథాంశం. నక్సలిజం భావాలున్న రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించాడా లేదా అన్నదే సినిమా.

తుపాకీ గొట్టంలో శాంతి లేదు… అమ్మాయి ప్రేమలో ఉంది….

1990- 92 నేపథ్యంలో తెలంగాణ లో సాగే ఈ కథలో వేణు ఉడుగుల తెలంగాణ పల్లె వాతావరణం అప్పట్లో ఎలా ఉండేదో చక్కగా చూపించారు. వేణు ఉడుగుల సొంతంగా డైలాగులు రాసుకోవడం వల్ల కొన్ని డైలాగులు సినిమాలో బాగా పేలాయి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. మా ఊళ్ళల్లో ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు, అన్యాయాలు జరిగినపుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు… నోరు లేని సమాజానికి నోరు అందించారు అని సాగే డైలాగు ఆకట్టుకుంది. ఇక దళ నాయకుడిగా రానా నటన ఆకట్టుకుంటుంది. ఇక కథకు మూలమైన వెన్నెల పాత్రధారి సాయి పల్లవి నటన చూపు తిప్పనివ్వదు. ఎంత మంది ఉన్న కళ్ళతోనే హావభావలను పలికించి సాయి పల్లవి ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఇక దళ సభ్యులుగా నటించిన ప్రియమణి (భారతక్క) నవీన్ చంద్ర ( రఘన్న) గాను ప్రొఫెసర్ శకుంతల గా నందిత దాస్ నటన బాగుంది. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల రవన్న దళాన్ని పోలీసులనుండి తప్పించడానికి చేసే సాహసం గుస్ బంప్స్ తెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ లో రవన్న తనతల్లిని కలవడానికి వెళ్ళినపుడు పోలీసులతో యాక్షన్ సన్నివేశం అదిరిపోయింది. ఇక చివర్లో వెన్నెల చనిపోవడం ప్రేక్షకులను కంటతడి పెట్టించి థియేటర్ నుండి బయటికీ రప్పించింది . ఇక సినిమాలో ప్రధాన బలం సంగీతం సురేష్ బొబ్బిలి అందించిన పాటలు కథతో పాటు సాగేవిగా ఉండటంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. నేపథ్యం సంగీతము బాగుంది. ఇక ఎమోషనల్ సన్నివేశాలు ఎంత కన్నీరు పెట్టించాయో యాక్షన్ సన్నివేశాలు అంతలా ఆకట్టుకున్నాయి. దర్శకుడు కథను ఎక్కడ కమర్షియల్ వాసన రానివ్వకుండా కథను ఎలా చెప్పాలనుకున్నాడో అలానే చెప్పాడు.

తెలంగాణ పల్లె అందాలు, అడవుల సౌందర్యాన్ని చక్కగా చూపించారు. దివాకర్ మణి, డానీ సాంచేజ్ లోపేజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఓకే అనేలా ఉంది. ఓవరాల్ గా నక్సలిజం నేపథ్యంలో తెలుగులో చాలా కథలే వచ్చిన ఇదొక కొత్త ప్రయత్నమనే చెప్పాలి. కథ పరంగా ఇంకా యాక్షన్ సన్నివేశాలకు స్కోప్ ఉన్నా దర్శకుడు ఎక్కువ ఫోకస్ చేయలేదనిపిస్తుంది. ఇక సినిమాలో ఎందుకు వెన్నెల రవన్న ప్రేమలో పడిందో బలమైన కారణం చెప్పలేదు. ఒక మీరాబాయి కృష్ణుడు కోసం ఎలా చేసిందో అలా వెన్నల రవన్న కోసం ఇంటినుండి వెళ్ళిపోయి కష్టాలు పడిందని దర్శకుడు పోల్చి చెప్పే ప్రయత్నం చేసాడు. మొత్తానికి సినిమా కమర్షియల్ కథ కోరుకునే వారికి నచ్చక పోవచ్చు అయితే ఒక ఫీల్ గుడ్ మూవీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

Sada Nannu Nadipe: సదా నన్ను నడిపే మూవీ రివ్యూ.. ఎమోషన్స్ తో ఆకట్టుకున్న ప్రేమకథ?

Sada Nannu Nadipe: హీరో ప్రతీక్ ప్రేమ్ కరణ్, వైష్ణవి పట్వర్ధన్ జంటగా నటించిన తాజా చిత్రం సదా నన్ను నడిపే. ఈ సినిమాకు హీరో ప్రతీక్ ప్రేమే దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. వీరితో పాటుగా ఈ సినిమా లో రాజీవ్ కనకాల,నాజర్, నాగేంద్రబాబు, అలీ, రంగస్థలం మహేష్ పలువురు కీలక పాత్రల్లో నటించారు. స్వచ్ఛమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం,స్క్రీన్ ప్లే, సంగీతాన్ని హీరో ప్రతీక్ అందించారు.

కథ: ఇందులో మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సాహాని (వైష్ణవి పట్వర్దన్) ప్రేమిస్తూ ఉంటాడు. అయితే ఆమె ఎంత కాదన్నా కూడా ఆమెనే ఎంతో సిన్సియర్ గా ప్రేమిస్తూ ఉంటాడు. సాహా తండ్రి రాజీవ్ కనకాల కూడా మైఖేల్ జాక్సన్ ప్రేమని అంగీకరించడు. దీనితో మైఖేల్ జాక్సన్ ఎలాగైనా సాహా ప్రేమని పొందాలని పరితపిస్తూ,మొత్తానికి మైఖేల్ జాక్సన్ సాహాని వివాహం చేసుకుంటాడు. కానీ సాహా మాత్రం పెళ్ళైన మొదటి రోజు నుంచే మైఖేల్ జాక్సన్ ని దూరం పెడుతుంది. పెళ్లి తర్వాత కూడా సాహా మైఖేల్ జాక్సన్ ను ఎందుకు దూరంగా పడుతుంది. దూరం పెట్టడానికి గల కారణం ఏమిటి? మరి మైఖేల్ జాక్సన్ చివరికి ఆమెకు దగ్గర అవుతాడా లేదా అన్న అంశాలతో ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారు.

కథా కథనం విశ్లేషణ :ఈ సినిమా కంటే ముందు వచ్చిన కలిసుందాం రా, గీతాంజలి లాంటి సినిమాల మాదిరిగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను హీరో కమ్ డైరెక్టర్ ఎంతో అద్భుతంగా ఎమోషనల్ గా, స్వచ్ఛమైన ప్రేమకథతో ఎంటర్టైనింగ్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడం జరిగింది. అయితే మనకు బాగా కావాల్సిన వ్యక్తి చనిపోతున్నారు అని తెలిసిన తరువాత వారితో గడిపిన ఆ చివరి క్షణాలను ఎంత మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటాం అన్నది ఇందులో బాగా చూపించారు. ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతకైనా తెగించే వచ్చు అన్న అంశాన్ని ఇందులో ఎమోషనల్గా తెరకెక్కించడంతో దానికి ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యారు.

నటీనటుల పనితీరు :ఇందులో హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ ప్రేమ్ కరణ్ అద్భుతంగా నటించడంతో పాటుగా దర్శకత్వ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. అదే విధంగా హీరోయిన్ కూడా తన పాత్రకు బాగా న్యాయం చేసింది. అలాగే ఇందులో కమెడియన్ ఆలీ ఉన్నంతవరకు బాగానే నవ్వులు పూజించాడు.

సాంకేతిక నిపుణుల పనితీరు :ఈ సినిమాలో సంగీతం బాగుంది. అలాగే నందు కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగుంది. అదే విధంగా కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగా రిచ్ గా ఉంటుంది.

చిత్రం: సదా నన్ను నడిపే (UA)

రిలీజ్ డేట్: 2022-06-24

బ్యానర్: ఆర్ పి మూవీ మేకర్స్

నటీనటులు: ప్రతీక్ ప్రేమ్ కరణ్ , వైష్ణవి పట్వర్ధన్, నాజర్, అలీ, రాజీవ్ కనకాల, రంగస్థలం మహేష్, జీవ తదితరులు

డీవోపీ: ఎస్ డి జాన్

ఎడిటర్: ఎస్ ఆర్ శేఖర్

మ్యూజిక్ డైరెక్టర్: ప్రతీక్ ప్రేమ్ కరణ్ , ప్రభు ప్రవీణ్

నిర్మాతలు: ఆర్ పి మూవీ మేకర్స్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రతీక్ ప్రేమ్ కరణ్

రేటింగ్: 2.75/5

Sarkaru Vaari Paata Twitter Review : సర్కారు వారి పాట ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..

Sarkaru Vaari Paata Twitter Review : మహేష్ బాబు, కీర్తీ సురేష్ తొలిసారి జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే నిన్నటి నుండే ప్రీమియర్ షోల సందడి మొదలయింది. రెండు సంవత్సరాల తరువాత వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో బాగా అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా టీజర్, ట్రైలర్ మరింత అభిమానులను ఊరించాయి.

Sarkaru Vaari Paata Twitter Review

ఫస్ట్ హాఫ్ బొమ్మ అదిరింది….

ఇక కళావతి పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. ఇక సితార డాన్స్ చేసిన పెన్నీ సాంగ్, హీరో సోలో సాంగ్, ఇక చివర్లో విడుదల చేసినా బాగా క్రేజ్ సంపాదించుకున్న మ మ మహేశా పాట సూపర్ స్టార్ స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సినిమా ను పోకిరి సినిమాతో పోల్చడం తో మరింత హైపర్ వచ్చింది. ఈ రోజు విడుదల అయిన సినిమా గురించి అపుడే నెట్టింట్లో చర్చ మొదలయిపోయింది.

మహేష్ కెరీర్ లో బెస్ట్ సినిమా కామెడీ టైమింగ్ అదిరింది అయితే కొన్ని చోట్ల థమన్ బిజీఎం బాగోలేదు అంటూ కొంతమంది నెటిజన్స్ అభిప్రాయ పడ్డారు. మరో నెటిజెన్ సినిమా మొదటి భాగం బాగుంది యాక్షన్ సన్నివేశాలకు ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లకు థమన్ బిజీఎం బాగోలేదు. ఇక మరో నెటిజెన్ మహేష్ వన్ మాన్ షో, కామెడీ ట్రాక్ బాగుంది సినిమాలో అన్న లుక్ సూపర్ అంటూ పోస్ట్ చేసాడు. ఇక ఈ రివ్యూలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.

Acharya Twitter Review : ఆచార్య ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..

Acharya Twitter Review : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా నేపద్యంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఈరోజు (ఏప్రిల్‌ 29) న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

నక్సలిజం ఆవేశం తో కూడిన వ్యక్తి టెంపుల్ టౌన్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అన్నది సినిమా కథగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మొదటిసారిగా చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయిలో కలిసి నటించడం, ఆర్ఆర్ఆర్ అద్బుత విజయం తరువాత రామ్ చరణ్ నటించిన సినిమా ఇదే కావడంతో ఆచార్య సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో విదులైన పాటలు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. మరోవైపు ప్రమోషన్లు కూడా భారీగానే చేశారు. ఈ నేపధ్యంలో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.

ఇప్పటికే ఓవర్సీస్ లో పలు చోట్ల షోలు పడిపోవడంతో అక్కడ సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ఎలా ఉందో వారి అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందని, పెద్దగా ఎలివేషన్స్, హైప్ ఇచ్చే సీన్స్ ఏమీ లేవని,. అయితే మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని సెకండ్ హాఫ్ లో ఉన్నాయని చెబుతున్నారు. ఇక క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉందంటున్నారు.

#Acharya ఫస్ట్ హాఫ్ చూసాక చాలా రోజుల తర్వాత ఒక ప్రసాంతమయిన ఫీలింగ్.. అరుపులు కేకలు మోషన్స్ రావటనట్టు ఎక్స్ప్రెషన్న్స్ ఏమి లేవు.. #ManiSharma బీజీమ్ కూడా చాలా డీసెంట్ గా ఉంది.. North వాళ్లకు బాగా ఎక్కే అవకాశాలు వున్నాయి. అంతా దేవగట్టం గురించే” అంటూ ఒకరు కామెంట్ చేసారు. ఓవరాల్ గా సినిమా బాగుందని అంటూనే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉందంటున్నారు.. ఇంకేంటి ఆలస్యం మీరు కూడా చూసేయండి.