Featured

అందుకే ‘బ్రహ్మోత్సవం’ సినిమా అట్టర్ ఫ్లాపయింది.. ఈ సినిమాతో మహేష్‌కి భారీ నష్టం !

సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి ఫాంలో ఉన్నప్పుడు చేసిన బ్రహ్మోత్సవం ఆయన ఫాం కి గట్టి బ్రేక్ వేసింది. సక్సెస్ లలో ఉన్న దర్శకులకి అవకాశాలిచ్చే మహేష్ అదే ఈ సినిమాకి ఫాలో అయ్యాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. దిల్ రాజు తీసుకు వచ్చాడంటే ఖచ్చితంగా ఆ దర్శకుడికి మంచి టాలెంట్ తో పాటు స్టార్ హీరోలను డీల్ చేయగల సత్తా కూడా ఉంటుందని అందరూ గట్టిగా నమ్ముతారు. అందుకు ఉదాహరణ సుకుమార్, వంశీపైడిపల్లి లాంటివారే. అలాగే మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల మీద ఇండస్ట్రీ వర్గాలతో పాటు హీరోలకి మంచి నమ్మకం ఏర్పడింది.

హ్యాపీడేస్ తర్వాత వరుణ్ సందేశ్ కి టాలీవుడ్ లో యంగ్ హీరోగా మంచి క్రేజ్ వచ్చిది. దాంతో ఈ హీరోతో కొత్త బంగారులోకం అనే సినిమా నిర్మించాడు దిల్ రాజు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీకాంత్ అడ్డాల. అలాగే హీరోయిన్ గా శ్వేత బసుప్రసాద్ హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో శ్రీకాంత్ అడ్డాల స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. అదే సినిమాతో రావు రమేశ్ కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ సినిమాకి కథ రాశాడు. అదే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు.

దిల్ రాజు కాబట్టి ఈ సినిమా వచ్చింది గానీ వేరే నిర్మాత అయితే అంత సులభంగా ఈ సినిమాను నిర్మించే వారు కాదేమో. బాలీవుడ్ సినిమాల ప్రేరణతో దర్శకుడు కథ రాసుకున్నాడు. హిందీలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు మొహబ్బతేన్, కభీ ఖుషీ, కబీ ఘం లాంటి సినిమాల తరహాలో భారీ తారగణంతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రూపొందించారు. ఈ కథలో ఏమాత్రం మాస్ ఎలిమెంట్స్ లేకపోయినా కంప్లీట్ గా క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకొని మొండి ధైర్యంతో ఈ సినిమాను నిర్మించారు. లక్కీగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం విశేషం.

అయితే ఇదే ఆలోచనతో మరోసారి భారీ తారాగణంతో బ్రహ్మోత్సవం సినిమా తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల. పి వి పి, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్స్ లో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా నిర్మాణంలో మహేష్ కూడా భాగస్వామి. కాజల్, ప్రణీత, రావు రమేశ్, సత్యరాజ్, ఇలా పెద్ద స్టార్ కాస్టింగ్ తో నిర్మించారు. అయితే ఈ సినిమాకి కావాల్సిన బలమైన కథే లేదు. దాంతో సినిమా చూసిన ప్రేక్షకుడికి బుర్ర చెడి బయటకు వచ్చారు. ఫస్ట్ షోకి ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ సినిమాకి ముందు మహేష్ కొరటాల శివతో శ్రీమంతుడు సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు.

ఆ ప్రభావం కూడా బ్రహ్మోత్సవం మీద పడి భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అందరూ కలిసుండాలి అనే పాయింట్ తప్ప ఎంతమాత్రం ఆడియన్స్ ని మెప్పించలేని కథ, కథనంతో దర్శకుడు బ్రహ్మోత్సవం తీసి ట్రోల్స్ కి గురయ్యాడు. ఈ సినిమా రిజల్ట్ చూసి మళ్ళీ అవకాశలివ్వడానికి మేకర్స్ కి ధైర్యం చేయలేకపోయారు. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో మహేష్ ఇందులో ఒక పార్టనర్ కాబట్టి ఆయనకి బాగానే నష్టం వచ్చిందని టాక్ వినిపించింది.  ఇక ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల వెంకటేశ్ హీరోగా నారప్ప సినిమాను రూపొందంచాడు. ఇటీవల రిలీజైన ఈ సినిమాకి అంత ఆశాజనికంగా రివ్యూస్ రాలేదు. ఒకరకంగా దర్శకుడు ఈ సినిమాను సరిగ్గా తీయలేకపోయాడని టాక్ వినిపిస్తోంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago