గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె పలుచోట్ల ప్రాపర్టీలను కొని బాగా ఆస్తులు సంపాదించినదని తెలుస్తోంది. అయితే ప్రియాంక చోప్రా తాజాగా తన ప్లాట్ ను అమ్మేసింది. అదేవిధంగా ముంబైలో తన ఆఫీసులో కూడా ఖాళీగా ఉండటం ఎందుకని వాటిని అద్దెకు ఇస్తోంది.
మహారాష్ట్రలోని అంధేరీలో ఓ బిల్డింగ్‌లో ఏడో అంతస్తులో ఉన్నటువంటి ఒక ఫ్లాట్‌ను రూ. 3 కోట్లకు ఈ ఏడాది మార్చిలో అమ్మింది. అదే విధంగా తాజాగా అదే అంతస్తులు 4 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. అయితే ప్రియాంకకు ఈ విధంగా అమ్మడం కొనడం కొత్తేమీ కాదు.
ప్రియాంక చోప్రా అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకొని ఆమె లాస్ ఏంజెల్స్ లో స్థిరపడిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబై లో ఉన్నటువంటి తన ఫ్లాట్ ను నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఏకంగా ఏడు కోట్లకు కొనుగోలు చేశారు.ప్రస్తుతం ప్రియాంక లాస్ ఏంజెల్స్ లో నివసించడం వల్ల ముంబై లో ఉన్నటువంటి తన ఆఫీసును కూడా అద్దెకు ఇవ్వాలని భావిస్తోంది.
ఈ విధంగా ప్రియాంక ఆఫీస్ అద్దెకిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఆఫీసులోకి అద్దెకు రావాలంటే నెలకు రూ.2.11 లక్షలు కట్టాల్సిందే. ఈ విధంగా ప్రియాంక తన ఆస్తులను అమ్ముతూ.. కొంటూ ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్లోబల్ స్టార్ లాస్ ఏంజెల్స్ లో నివసిస్తున్న నివాసం ఏకంగా 150 కోట్లు విలువ చేస్తుందని చెప్పవచ్చు. గత కొద్ది నెలల క్రితమే ప్రియాంక చోప్రా ఈ ఇంటిలోకి గృహ ప్రవేశం చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…