అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై రాణించాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఖచ్చితంగా ఉండాలన్న సత్యాన్ని నిరూపిస్తూ బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తోంది యాంకర్ విష్ణుప్రియ. అనసూయ, రశ్మీలాంటి స్టార్ యాంకర్స్ కి గట్టి పోటీయే ఇస్తుంది విష్ణు ప్రియ. ‘పోవే పోరా’ ప్రోగ్రాంలో సుధీర్ కు జోడిగా చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. ఈ ప్రోగ్రాం తో బాగా ఫాపులర్ అయింది. ఈ ప్రోగ్రాం చేయకముందు షార్ట్ ఫిల్స్, వెబ్ సిరీస్ లో విష్ణు ప్రియ నటించింది.
ఇప్పుడు మాత్రం తనదైన స్టైల్లో హావభావాలు పలికిస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ అడపాదడపా కనిపిస్తుంటుంది. ఇక ఆమె స్నేహితురాలు యాంకర్ శ్రిముఖితో కలిసి విడియోలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. ఇక స్కిన్ షో విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గిన ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ బాగానే ఫాలోయింగ్ ఉంది.
ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్ తన అభిమానులతో ముచ్చటించిన విష్ణు ప్రియ.. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో వివరిస్తూ ఒక పోస్టును పెట్టింది. అందులో ఆషికి-2 సినిమాలోని హీరో ఆదిత్యరాయ్ కపూర్‌లాంటి వ్యక్తి భర్తగా రావాలని, అయితే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయితే ఇలాంటి వ్యక్తిని భర్తగా ప్రసాదించు దేవుడా అంటూ ఇన్‌స్టా స్టోరీలో తన మనసులో మాటను రాసుకుంది. ఇక విష్ణు ప్రియ చేసిన పోస్టు నేట్టింత తెగ వైరల్ అవుతుంది. దీంతో ‘వచ్చే జన్మదాకా ఎందుకు ఈ జన్మలోనే నువ్వు కోరుకున్న వ్యక్తి దొరుకుతాడులే’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…