టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ లో సినిమా అంటే అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో.. ఇండస్ట్రీ వర్గాలలో ఉండే అంచనాలు వేరే లెవల్. కొన్ని క్రేజీ కాంబినేషన్ కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇక ఆ మూవి హీరో లేదా డైరెక్టర్ కి మైల్ స్టోన్ మూవీ అయితే మాత్రం అందరిలోనూ అదే చర్చలు సాగుతుంటాయి. అలాంటి సుదీర్గమైన చర్చలు సాగిన కాంబినేషన్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నట సింహం నందమూరి బాలకృష్ణలది. వీరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని బాగా ఊదరగొట్టారు. బాలయ్య అభిమానులు కూడా వీరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవుతుందని తెగ సంబరపడ్డారు.
ఇక బాలయ్య కెరీర్ లో 100వ సినిమా అనగానే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అండ్ యంగ్ డైరెక్టర్స్ బాగా పోటీ పడ్డారు. ఆయన తో బ్లాక్ బస్టర్స్ తీసిన బి.గోపాల్, ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ, కె ఎస్ రవి కుమార్, పూరి జగన్నాథ్, కృష్ణ వంశీ సహా చాలా మంది బాలయ్యతో ఆయన 100 సినిమాను తెరకెక్కించాలని కథ రెడీ చేసుకున్నారు. కానీ ఎక్కువగా ప్రచారంలో నిలిచింది మాత్రం కృష్ణవంశీ పేరే. వీరి కాంబినేషన్ మూవీ కోసం రైతు అనే టైటిల్ కూడా చాంబర్ లో రిజిస్టర్ చేయించినట్టు వార్తలు వచ్చాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ సాగుతుందని వార్తలు వచ్చాయి.
బాలయ్యను రెండు విభిన్నమైన పాత్రల్లో కృష్ణవంశీ చూపించనున్నట్టు.. అందులో ఒకటి పల్లెటూరు గెటప్‌లో పంచె కట్టుకొని కనిపిస్తాడని, ఈ పాత్ర చాలా హైలెట్ అవుతుందని చెప్పుకున్నారు. ఇక ఈ నెలలోనో వచ్చే నెలలోనో మూహుర్తం అని వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. కానీ అనుకోకుండా వీరి కాంబోలో సినిమా పట్టాలెక్కలేదు. బాలయ్య 100వ సినిమా బాధ్యతలు క్రిష్ కి అప్పజెప్పారు బాలయ్య. ఆ బాధ్యతను క్రిష్ సమర్ధవంతంగా నిర్వర్తించి బాలయ్య 100వ సినిమాగా గౌతమీ పుత్ర శాకర్ణి తీసి భారీ హిట్ ఇచ్చారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది.
క్రిష్ కి బాలయ్య తన 100వ సినిమా అవకాశం ఇస్తాడని ఏ ఒక్కరు ఊహించలేదు. అయితే బాలయ్య – కృష్ణవంశీ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కకపోవడానికి కారణం మెగాస్టర్ అని వార్తలు వచ్చాయి. మెగాస్టార్ అంటే మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కాదు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఈ సినిమాలో అమితాబ్ చేయాల్సిన ఓ కీలకమైన పాత్ర ఉందట. అది అమితాబ్ చేస్తేనే కరెక్ట్ అని భావించి అమితాబ్ లేకుండా సినిమా చేయకూడదని ఈ ప్రాజెక్ట్ ఆపినట్టు తెలుస్తోంది. అయితే అమితాబ్ అడగగానే నాగార్జున మనం, మెగాస్టార్ సైరా సినిమాలో నటించారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ – దీపిక పదుకోన్ కాంబినేషన్ లో నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్న సైన్స్ ఫిక్షన్ లో కూడా నటించడానికి అంగీకరించారు. కానీ బాలయ్య – కృష్ణవంశీ ప్రాజెక్ట్ కి ఎందుకు నో అన్నారనేది మాత్రం సస్పెన్స్ గా ఉండిపోయింది.
అయితే ప్రస్తుతం కృష్ణవంశీ మరాఠీ హిట్ సినిమా నట సామ్రాట్ ని రంగ మార్తాండగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాకుండానే అన్నం అనే పేరుతో మరో ప్రాజెక్ట్ ని ప్రకటించారు. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి సినిమాలను కమిటయ్యారు. అంటే ఇప్పట్లో బాలయ్య – కృష్ణవంశీ ప్రాజెక్ట్ లేనట్టే అని అర్థమవుతోంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…