ప్రస్తుతం భారత దేశం రెండవ దశ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలోనే దేశ ప్రజలందరూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ మెలగటంతో మూడవ దశను అరికట్టవచ్చని ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. దేశం రెండవ దశ నుంచి కోలుకున్నప్పటికీ పూర్తిగా ఇమ్యూనిటీ పొందలేదని తద్వారా రాబోయే రోజులలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా దేశ ప్రజలకు హెచ్చరించారు.
ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు థర్డ్ వేవ్ దిశగా వెళుతున్నాయి. ముఖ్యంగా ఇండోనేషియా మలేషియా బంగ్లాదేశ్ వంటి దేశాలలో థర్డ్ వేవ్ కొనసాగుతోందని ఈ క్రమంలోనే భారత దేశ ప్రజలందరూ అప్రమత్తం కావాలని సూచించింది. కరోనా వైరస్ వివిధ వేరియంట్లో రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తోంది.ఈ క్రమంలోనే ఈ వైరస్ ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ..వ్యాక్సింగ్ వేయించుకున్న అప్పుడే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురావచ్చని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రస్తుతం మనదేశంలో పరిస్థితి అదుపులో ఉంది అయితే ఇవే జాగ్రత్తలను కఠిన నియమాలను పాటించడంతో కొంతవరకు థర్డ్ వేవ్ తీవ్రత లేకుండా కాపాడుకోవచ్చు. ఈ క్రమంలోనే వచ్చే 100 నుంచి 125 రోజులు ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.అని వీకే పాల్ స్పష్టం చేశారు. దేశంలో ఈ మహమ్మారిని అరికట్టడం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. థర్డ్ వేవ్ మన దేశంలోకి ఎంటర్ అయ్యేలోపు వ్యాక్సిన్ రూపంలో ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీని పెంచుకోవాలని నీతి అయోగ్ సభ్యుడు సూచించారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…