ఈ 125 రోజులే ఎంతో కీలకం… జాగ్రత్తలు తప్పనిసరి: వీకే పాల్

0
313

ప్రస్తుతం భారత దేశం రెండవ దశ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలోనే దేశ ప్రజలందరూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ మెలగటంతో మూడవ దశను అరికట్టవచ్చని ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. దేశం రెండవ దశ నుంచి కోలుకున్నప్పటికీ పూర్తిగా ఇమ్యూనిటీ పొందలేదని తద్వారా రాబోయే రోజులలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా దేశ ప్రజలకు హెచ్చరించారు.

ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు థర్డ్ వేవ్ దిశగా వెళుతున్నాయి. ముఖ్యంగా ఇండోనేషియా మలేషియా బంగ్లాదేశ్ వంటి దేశాలలో థర్డ్ వేవ్ కొనసాగుతోందని ఈ క్రమంలోనే భారత దేశ ప్రజలందరూ అప్రమత్తం కావాలని సూచించింది. కరోనా వైరస్ వివిధ వేరియంట్లో రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తోంది.ఈ క్రమంలోనే ఈ వైరస్ ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ..వ్యాక్సింగ్ వేయించుకున్న అప్పుడే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురావచ్చని ఈ సందర్భంగా తెలిపారు.

ప్రస్తుతం మనదేశంలో పరిస్థితి అదుపులో ఉంది అయితే ఇవే జాగ్రత్తలను కఠిన నియమాలను పాటించడంతో కొంతవరకు థర్డ్ వేవ్ తీవ్రత లేకుండా కాపాడుకోవచ్చు. ఈ క్రమంలోనే వచ్చే 100 నుంచి 125 రోజులు ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.అని వీకే పాల్‌ స్పష్టం చేశారు. దేశంలో ఈ మహమ్మారిని అరికట్టడం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. థర్డ్ వేవ్ మన దేశంలోకి ఎంటర్ అయ్యేలోపు వ్యాక్సిన్ రూపంలో ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీని పెంచుకోవాలని నీతి అయోగ్ సభ్యుడు సూచించారు