చంద్రమోహన్.. హీరోగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాల్లో అద్భుత నటన కనబరిచాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందుకు సాగుతున్నాడు. ఈయనకు ఓ విచిత్ర అలవాటు ఉంది. చిన్నపిల్లలు తన దగ్గరికి వస్తే చాలు.. పక్కన కూర్చోబెట్టుకోని ముచ్చట్లు చెప్తాడు. మధ్య మధ్యలో చెవి మీద వేళ్లతో చిటుక్కన కొడతాడు. మెత్తటి బాగం కావడంతో సర్రున మంట మండేది. కొంత మంది పిల్లలు ఏడ్చేవారు. సేమ్ అలీని కూడా ఇలాగే చేశాడు చంద్రమోహన్.. అలీ బాల నటుడిగానే సినిమాల్లోకి అడుగు పెట్టాడు. ఓసారి తనను ఇలాగే కొట్టాడు. అప్పటి నుంచి సెట్స్ మీద చంద్రమోహన్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చినా.. చంద్రమోహన్ తనను పిలిచినా చెవులను చేతులతో మూసుకుని వెళ్లేవాడు.
ఓసారి అలీ సినిమా షూటింగ్ కు వెళ్లాడు. అప్పుడు తనతో పాటు వాళ్ల అమ్మాయిని కూడా తీసుకెళ్లాడు. ఆ పాపతో పాటు అలీ కజిన్ కొడుకు కూడా వచ్చాడు. అలీ కూతురు కంటే ఆ అబ్బాయి కాస్త పెద్దవాడు. అప్పుడు అక్కడే ఉన్న చంద్రమోహన్ ఆ అబ్బాయిని దగ్గరికి పిలిచాడు. పేరు సహా పలు వివరాలు అడిగాడు. ముచ్చట్లు చెప్పిన తర్వాత అలవాటు ప్రకారం తన చేతి వేళ్లతో ఆ అబ్బాయి చెవు మీద కొట్టాడు. ఆ అబ్బాయి అబ్బా అంటూ బాధతో ఏడ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ విషయం అలీ కూతురు చూసింది. అక్కడున్న ఓ రాయి తీసుకుని చంద్రమోహన్ దగ్గరికి వెళ్లింది. ఇప్పుడు కొట్టు అంటూ ఆయన వైపు రాయి చూపించింది. ఆమె వాలకం చూస్తే నిజంగా రాయి విసిరేలా అనిపించింది.
ఆ అమ్మాయి చేసిన పనికి చంద్రమోమన్ అవాక్కయ్యాడు. నిజంగానే కొడుతుందేమోనని భయపడ్డాడు. రేయ్ అలీ.. ఆపరా దాన్ని అంటూ గట్టిగా కేకలు వేశాడు. వెంటనే అక్కడి నుంచి లేచి పక్కకు పరిగెత్తాడు. ఆ పాప కూడా తన వెనకాలే పడింది. కొంత దూరం తనను తరిమింది. వెంటనే అలీ అక్కడకు వచ్చి అమ్మాయిని ఆపాడు. ఇప్పటికీ అలీ కూతురంటే తనకు భయమని చెప్పాడు చంద్రమోహన్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…