Categories: General News

అశ్లీల చిత్రాలకు బానిసై ఈ నీచుడు భార్యని ఏమిచేసాడంటే..దయచేసి ఇలా ఎవ్వరు చేయకండి..

భ‌ర్త ఫోన్‌లో పోర్న్ వీడియోల‌ను చూస్తున్నాడ‌ని విసుగు చెందిన భార్య ఇంట్లో అమ‌ర్చిన వైఫై హాట్‌స్పాట్‌ను ఆఫ్ చేసింది. అదే ఆమె చేసిన పాపం. ఆమె చేసిన ఈ చ‌ర్య ఆ భ‌ర్త‌ను తీవ్ర ఆగ్ర‌హానికి గురి చేసింది. భార్యను తీవ్రంగా కొట్టాడు. ముఖం ప‌గిలేలా పంచ్‌లు ఇచ్చాడు. అత‌ని రాక్ష‌స దెబ్బ‌ల‌కు ఆమె తీవ్రంగా గాయ‌పాలైంది. ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోంది. తాజాగా ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటు చేసుకుంది.

హైద‌రాబాద్ లోని ఖైర‌తాబాద్ స‌మీపంలోని బీఎస్ మ‌ఖ్తాకు చెందిన ఆ భ‌ర్త పేరు మ‌హ‌మ్మద్ ఉమ‌ర్‌. అతను రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. ఏడేళ్ల కింద‌ట అత‌నికి రేష్మ అనే యువ‌తితో పెళ్ల‌యింది. రాజ్‌భ‌వ‌న్ స‌మీపంలోని బీఎస్ మ‌ఖ్తాలో నివాసం ఉంటున్నారు.వారికి ముగ్గురు పిల్ల‌లు. అతని వ్యాపార కార్య‌క‌లాపాల కోసం ఉమ‌ర్ ఇంట్లో వైఫై హాట్‌స్పాట్‌ను అమ‌ర్చుకున్నాడు. అలా అత‌నికి సెల్‌ఫోన్‌లో పోర్న్ వీడియోల‌ను చూడ్డానికి బానిస అయ్యాడు. బుధ‌వారం అర్ధ‌రాత్రి అయిన‌ప్ప‌టికీ నిద్ర‌పోకుండా పోర్న్ వీడియోల‌ను చూస్తూ కూర్చున్నాడు. దీనితో కోపంతో ప‌లుమార్లు అత‌నికి నిద్ర‌పొమ్మ‌ని చెప్పింది రేష్మ‌.

అయిన‌ప్ప‌టికీ.. అత‌ను ప‌ట్టించుక‌క‌పోవ‌డంతో తీవ్రంగా విసుగు చెందిన తను నేరుగా వెళ్లి వైఫై స్విచ్‌ను ఆపేసింది. దీనితో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన ఉమ‌ర్‌.. రేష్మ‌ను ఇష్టానుసారంగా చిత‌గ్గొట్టాడు. ముఖంపై పంచ్‌లు ఇచ్చాడు. అతని దెబ్బ‌కు ఆమె తీవ్రంగా గాయ‌ప‌డింది. ఆమె కేక‌లు విన్న ఇరుగు పొరుగు వారు రేష్మ‌ను అత‌ని బారి నుంచి కాపాడారు.ఉమ‌ర్ దెబ్బ‌ల‌కు సొమ్మ‌సిల్లిన రేష్మ‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమె అక్క‌డ చికిత్స తీసుకుంటున్నారు. రేష్మ‌, ఆమె త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు ఖైర‌తాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని అతనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago