భర్త ఫోన్‌లో పోర్న్ వీడియోలను చూస్తున్నాడని విసుగు చెందిన భార్య ఇంట్లో అమర్చిన వైఫై హాట్‌స్పాట్‌ను ఆఫ్ చేసింది. అదే ఆమె చేసిన పాపం. ఆమె చేసిన ఈ చర్య ఆ భర్తను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. భార్యను తీవ్రంగా కొట్టాడు. ముఖం పగిలేలా పంచ్‌లు ఇచ్చాడు. అతని రాక్షస దెబ్బలకు ఆమె తీవ్రంగా గాయపాలైంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. తాజాగా ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ సమీపంలోని బీఎస్ మఖ్తాకు చెందిన ఆ భర్త పేరు మహమ్మద్ ఉమర్. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఏడేళ్ల కిందట అతనికి రేష్మ అనే యువతితో పెళ్లయింది. రాజ్‌భవన్ సమీపంలోని బీఎస్ మఖ్తాలో నివాసం ఉంటున్నారు.వారికి ముగ్గురు పిల్లలు. అతని వ్యాపార కార్యకలాపాల కోసం ఉమర్ ఇంట్లో వైఫై హాట్‌స్పాట్‌ను అమర్చుకున్నాడు. అలా అతనికి సెల్‌ఫోన్‌లో పోర్న్ వీడియోలను చూడ్డానికి బానిస అయ్యాడు. బుధవారం అర్ధరాత్రి అయినప్పటికీ నిద్రపోకుండా పోర్న్ వీడియోలను చూస్తూ కూర్చున్నాడు. దీనితో కోపంతో పలుమార్లు అతనికి నిద్రపొమ్మని చెప్పింది రేష్మ.

అయినప్పటికీ.. అతను పట్టించుకకపోవడంతో తీవ్రంగా విసుగు చెందిన తను నేరుగా వెళ్లి వైఫై స్విచ్‌ను ఆపేసింది. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన ఉమర్.. రేష్మను ఇష్టానుసారంగా చితగ్గొట్టాడు. ముఖంపై పంచ్‌లు ఇచ్చాడు. అతని దెబ్బకు ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె కేకలు విన్న ఇరుగు పొరుగు వారు రేష్మను అతని బారి నుంచి కాపాడారు.ఉమర్ దెబ్బలకు సొమ్మసిల్లిన రేష్మను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. రేష్మ, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అతనిపై దర్యాప్తు చేపట్టారు.



























