Categories: FeaturedHealth News

ఆడవాళ్లకు అద్భుత వరం ఈ పండు.. ఒక్క పండుతోనే అద్భుత ప్రయోజనాలు, మగవారికీ అవసరమే!!

ఇప్పుడు విరివిగా దొరికే పండ్లలో పియర్ ఒకటి. చూడ్డానికి ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండు మహిళలకెంతో మేలు చేస్తుంది. మెనోపాజ్ దాటిన వారు తీసుకోవడం వల్ల గర్భకోశ సమస్యలూ, గుండె జబ్బులూ అదుపులో ఉంటాయి. కళ్లూ, చర్మం వంటి అలర్జీలతో బాధపడే వారు ఈ పండ్లు తింటే మంచిది. దీనిలో అలర్జీని దూరం చేసే పోషకాలు లభ్యమవుతాయి. మీకు వీలు దొరికినప్పుడల్లా ఒక్క పియర్ ఫ్రూట్ తిన్నా కూడా శరీరానికి అరుదైన, అవసరమైన అద్భుత పోషకాలు అందుతాయి. ఆడవాళ్లే కాదు మగవారికి కూడా పియర్ చాలా మేలు చేస్తుంది. సాధారణంగానే సీజనల్ ఫ్రూట్స్ తినాలని మన పెద్దలు అనాది కాలం నుంచే చెబుతూ వస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే పియర్ ఫ్రూట్ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి సీజనల్ ఫ్రూట్ అంటే జామ, బత్తాయి, యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, సీతాఫలం, మామిడి.. ఇలా ఎన్నో తింటాం కాని పియర్ తినే అలవాటు లేదు. మరి తినకపోతే ఆ పండులో మాత్రమే దొరికే పోషకాలు మనకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. అన్నట్లు పియర్ తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి చూద్దాం..

పియర్‌లో బీటా కెరొటిన్, ‘సి’ ‘కె’ విటమిన్లూ, పీచు, పొటాషియం వంటి పోషకాలు ఉండటం వల్ల అన్ని వయసుల వారూ వీటిని తీసుకోవచ్చు. వయసు పైబడిన వారు తినడం వల్ల అరుగుదల బాగుంటుంది. మనసు బాగోలేనప్పుడూ, పనిమీద ఏకాగ్రత కుదరనప్పుడూ ఒక పండు తిని చూడండి. కాసేపటికి ఒత్తిడి తగ్గి, ఉత్సాహం వస్తుంది. దీనిలో సెరటోనిన్ వంటి మేలు చేసే హార్మోన్లు ఉండటమే అందుకు కారణం. అందుకే ఆడా మగా తేడాలేకుండా పియర్ ను తినాల్సిందేనని చెప్పేది.

* కొందరికి తరచూ నోటి పూత వస్తుంటుంది. అలాంటి వారు ఈ పండ్లను తీసుకోవాలి. వీటిలో ‘బి’ విటమిన్లు అధికం. శక్తి కూడా బాగానే లభిస్తుంది.

* ఆహారం తక్కువ తీసుకొనే వారు ఈ పండుకు ప్రాధాన్యమివ్వాలి. ఎందుకంటే ఒక్క పండుద్వారానే ఎన్నో పోషకాలు అందుతాయి.

* దీనిలో త్వరగా కరిగిపోయే కొవ్వు ఉంటుంది. ఆహార నియమాలు పాటించే వారూ, బరువు తగ్గాలనుకునే వారు పియర్‌ని తరచూ తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ని కరిగించడానికీ దీనిలోని పోషకాలు ఉపయోగపడతాయి. ఈ పండు నుంచి అందే క్యాలరీలూ తక్కువే. వంద గ్రాముల పండులో యాభై ఎనిమిది కెలొరీలే ఉంటాయి.

* హెల్తీ అండ్ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్ ఇది. రోజుకి ఒక పియర్ పండు తినవచ్చు. ఇందులో కూడా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. చాలాసేపు ఆకలిగా అనిపించదు. మరీ ఎక్కువగా పండినది కాకుండా, మరీ పచ్చిగా ఉన్నది కాకుండా.. ఎంచుకోవాలి. వాటిలో అయితే.. షుగర్ తక్కువగా ఉంటుంది.

telugudesk

Recent Posts

బంగారం కొనేవారికి షాక్.. దిగుమతి సుంకం డబుల్!

కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న బంగారం కొనుగోళ్లను నియంత్రించడమే లక్ష్యంగా,…

12 hours ago

ఇంధన ధరలు మళ్లీ పెరుగుతాయా? గవర్నర్ కీలక వ్యాఖ్యలు

దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలపై ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో…

13 hours ago

ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ వేడుకకు భారీ ఏర్పాట్లు.. దేశవ్యాప్తంగా దృష్టి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. విడుదలకు ముందు ప్రచార…

13 hours ago

ప్రధాని కాన్వాయ్‌పై కీలక నిర్ణయం.. ఇంధన పొదుపుకు కొత్త దిశ..

దేశంలో ఇంధన వినియోగం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు తరువాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు…

13 hours ago

రైతుల ఆరాధ్య దైవంగా వెలిగిపోతున్న కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి.. తొలి పంట స్వామివారికే సమర్పణ!

తెలంగాణలోని వరంగల్ సమీపంలో ఉన్న కొమ్మాల గ్రామం ఆధ్యాత్మికతతో పాటు రైతు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రకృతి సోయగాల మధ్య…

15 hours ago

పెన్సిల్ లిడ్‌పై హనుమంతుడు..! సూక్ష్మ కళతో షాక్ చేసిన గిన్నిస్ రికార్డ్ కళాకారుడు!

ఏలూరు జిల్లా నర్సాపురం రుస్తుంబాధకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన…

16 hours ago