Categories: FeaturedMovie News

‘ఇడియట్’ హీరోయిన్ రక్షిత ఇలా అయిపోయిందేంటి? ఆమెను చూసి అభిమానులు నోరెళ్లబెడుతున్నారు.

మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ “ఇడియట్” సినిమా.. డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రంతో హీరోగా రవితేజ, డైరెక్టర్ గా పూరి జగన్నాద్ లకు ఎంత పేరు వచ్చిందో.. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ రక్షిత కు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఆమెకు తెలుగులో ఇది తోలి చిత్రం. నటించిన తొలి చిత్రంతోనే ప్రేక్షకులను తన అందంతో, నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో మరికొందరు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా వచ్చింది. చిరంజీవి సరసన “గోవిందుడు అందరివాడు” చిత్రంలో, నాగార్జున తో “శివమణి”, మహేష్ బాబు కి జతగా “నిజం”, ఎన్టీఆర్ “ఆంధ్రావాలా” వంటి సినిమాలతో స్టార్ హీరోల సరసన నటించింది రక్షిత. ఆ సమయంలో రక్షిత క్రేజ్ మామూలుగా లేదు. కొన్ని సినిమాలకు ఆమె కోసం మాత్రమే వెళ్లిన అభిమానులు కూడా ఉన్నారు. అప్పట్లో కుర్ర కారుని ఒక ఊపేసింది రక్షిత. తన అందంతో అలా కట్టిపడేసేది ఆమె.

అయితే రక్షిత అసలు పేరు శ్వేత. పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. తల్లిదండ్రులిద్దరూ సినిమా ఇండస్ట్రీలోనే ఉండటంతో ఆమెకు సినిమా ఎంట్రీ సులువుగానే వచ్చింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే పునీత్‌ రాజ్‌కుమార్‌ సరసన అప్పు అనే కన్నడ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాకి పూరీ జగన్నాథ్ డైరెక్టర్. అప్పు సినిమాకి రిమేక్ గా తెలుగులో ‘ఇడియట్’ చేసారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ అందుకోవడంతో రక్షిత కు అవకాశాలు భారీగా వచ్చాయి.

అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే కన్నడ దర్శకుడు ప్రేమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రక్షిత. 2007 లో వీరి వివాహం జరిగిన తరువాత ఆమె సినిమాల్లో నటించలేదు. పెళ్లి తరువాత రక్షిత సినిమాల వైపు చూడలేదు. మెల్ల మెల్లగా ఆమె ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ప్రస్తుతం కొన్ని కన్నడ టీవీ షో లలో జడ్జి గా వస్తున్నారు రక్షిత. ఇప్పుడు ఆమెను చుసిన వారు మాత్రం షాక్ అవుతున్నారు. ఇడియట్ సినిమాలో హీరోయిన్ గా మంచి స్ట్రక్చర్ మెయింటైన్ చేసిన రక్షిత ఇప్పుడు బాగా లావుగా కనిపిస్తున్నారు. ఎంతగానో లావైపోయిన ఆమెను చూసి అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. రక్షిత ఇలా అయిపోయిందేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తనకు కొడుకు పుట్టాక థైరాయిడ్‌ సమస్య రావడంతో ఇలా లావెక్కానని రక్షిత ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయినా నాజూకుగా ఉండటానికి ఇప్పుడు తానేమీ హీరోయిన్‌ను కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె నిర్మాతగా మారి ఏక్‌ లవ్‌ యా అనే సినిమాను నిర్మిస్తోంది. అంతేకాదు, చాలా రోజుల తరువాత ఈ సినిమాలో గెస్ట్‌ రోల్ లో నటిస్తోంది. గతంలో రెండు పార్టీలు మారిన ఆమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago