Featured

ఈ”బావ, బావమరుదులు”ఒకే సంవత్సరంలో వెండితెరకు పరిచయం అయ్యారని మీకు తెలుసా.?!

దేశ స్వాతంత్రాన్ని కంటే ముందే అక్కినేని నాగేశ్వరరావు సినీరంగ ప్రవేశం చేశారు. ఆ క్రమంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సినిమారంగంలో నిలదొక్కుకున్నారు. నటన, సినిమాఎంపికలో తనదైన ముద్రవేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆయన చిత్రాలు ఉండేవి. దగ్గుబాటి రామానాయుడు తన సొంత గ్రామము కారంచేడులో అక్కినేని హీరోగా “నమ్మినబంటు” సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సినిమాల్లోకి రమ్మని అక్కినేని డి.రామానాయుడును ఆహ్వానించారు. తన వ్యాపారాలకు స్వస్తి చెప్పి ఆయన 1963లో సినీ రంగంలో ప్రవేశించినప్పటికీ 1964లో తన పెద్ద కుమారుడైన సురేష్ బాబు పేరు మీదుగా సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించడం జరిగింది.

“రాముడు భీముడు”తో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పట్టాలెక్కింది. ఆ తర్వాత “సిపాయి చిన్నయ్య” అనే చిత్రంతో అక్కినేని, రామానాయుడు కాంబినేషన్ మొదలయ్యింది. అలా డి.రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ లో తొమ్మిదో సినిమాగా “ప్రేమ్ నగర్” అనే బ్లాక్ బస్టర్ సినిమా రూపొందించారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం మరింత బలపడింది.

కొన్ని సంవత్సరాలకు ఈ స్నేహం కాస్త బంధుత్వంగా మారింది. అక్కినేని, రామానాయుడు ఇద్దరూ వియ్యంకులుగా మారిపోయారు. డి.రామానాయుడు తన కూతురిని అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జునకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది.

1985లో అక్కినేని, రామానాయుడు తమ వారసులు ఇద్దరు సినిమాల్లోకి వస్తున్నారని ప్రకటించడంతో సినీ పరిశ్రమలో ఆసక్తిని నెలకొల్పింది. అన్నట్టుగానే 1986లో అక్కినేని నాగార్జున తమ బ్యానర్ అయిన అన్నపూర్ణ ప్రొడక్షన్స్ లో వి.మధుసూధనరావు దర్శకత్వంలో శోభన హీరోయిన్ గా “విక్రమ్”అనే సినిమాలో నటించడం జరిగింది.

ఇదే సంవత్సరంలో డి.రామానాయుడు కుమారుడు వెంకటేష్ హీరోగా తమ సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఖుష్బు హీరోయిన్ గా “కలియుగ పాండవులు” చిత్రంలో నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అలా అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి, ప్రస్తుతం స్టార్ హీరోలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. అయితే ఏఎన్ఆర్, రామానాయుడు ఇద్దరూ తమ పెద్ద కుమారులను నిర్మాతలుగా చేసి, చిన్న కుమారులను హీరోలుగా సినీ పరిశ్రమకు పరిచయం చేయడం ఒక విశేషం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

2 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

3 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

3 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

3 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

3 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

3 hours ago