Health News

ఔషధగుణాల గని త్రిఫలం .. వీళ్ళు మాత్రం దూరంగా ఉండాల్సిందే?

గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో త్రిఫలానికి ఎంతో విశిష్టత ఉంది. ఔషధ గుణాలు మెండుగా లభించే ఈ త్రిఫలాల నుంచి తయారుచేసిన చూర్ణం, గుళికలు 100 రోగాలను నయం చేయడానికి దోహదపడతాయి. ఈ క్రమంలోనే ఈ త్రిఫలం ఆయుర్వేదంలో ఎంతో విరివిగా ఉపయోగిస్తారు. ఉసిరి,కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల చూర్ణం అనే చెబుతారు. మరి త్రిఫల చూర్ణం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

త్రిఫల చూర్ణంలో ఎన్నో ఔషధ గుణాలతో పాటు సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ త్రిఫలలో ఉసిరికి చలువ చేసే గుణం ఉంటుంది. అదేవిధంగా కరక్కాయ కాలేయంలో వచ్చే సమస్యలను పోగొడుతుంది. ఇక తానికాయ ఆస్తమా చికిత్సకు ఎంతగానో దోహదపడుతుంది. ఈ మూడు కాయలను కలిసి తయారు చేసిన చూర్ణం మన శరీరంలో ఏర్పడే కఫ వాత పిత్త దోషాలను తొలగిస్తుంది. అదేవిధంగా ఈ చూర్ణం మన శరీరంలో ఏర్పడిన మలబద్దక సమస్యలను తొలగించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఈ త్రిఫల చూర్ణం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతోపాటు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కీలకపాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇక కంటి చూపును మెరుగుపరచడంలో ఈ త్రిఫల చూర్ణం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.

త్రిఫల చూర్ణంలో కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా, మన అందాన్ని రెట్టింపు చేసే గుణాలు కూడా ఈ త్రిఫల చూర్ణంలో ఉన్నాయి. త్రిఫల చూర్ణం తరచూ తీసుకోవటంవల్ల తెల్లని జుట్టు సమస్యను నివారించవచ్చు. అదేవిధంగా చర్మకాంతిని పెంపొందించుకోవచ్చు.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి త్రిఫల చూర్ణానికి గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు, శరీరంలో పిత్త దోషమున్నవారు దూరంగా ఉండాలి. మిగిలిన వారందరూ ఈ త్రిఫల చూర్ణాన్ని ఒక గ్లాసు నీటిలో లేదా పాలలో కలుపుకొని ప్రతిరోజు రాత్రి వల్ల అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago