Health News

ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నారా.. జాగ్రత్త లేదంటే కరోనా బారిన పడినట్టే!

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా మహమ్మారి తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు తమ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం పడని పాట్లు లేవు.మన శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉంటేనే కరోనా వైరస్ నుంచి మనం మనల్ని కాపాడుకోగలం. అయితే మనం రోజువారి పనులలో భాగంగా చేసే చిన్న చిన్న పొరపాట్లు వల్ల భవిష్యత్తులో ఎన్నో రకాల జబ్బుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

మన శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తి మెరుగ్గా పనిచేయాలంటే సైటోకిన్‌లను విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రోటీన్ కేవలం మనం నిద్ర పోయినప్పుడు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కనుక మన శరీరంలో రోగ నిరోధక శక్తి పనితీరు మెరుగ్గా ఉండాలంటే తప్పనిసరిగా సరైన నిద్ర ఉండాలి. ప్రస్తుత కాలంలో చాలా మంది మొబైల్ ఫోన్లలో కాలక్షేపం చేస్తూ నిద్రను దూరం చేసుకుంటున్నారు.

తరుచూ అధిక ఒత్తిడి ఆందోళనకు గురి కావడం వలన మన శరీరంలో రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలోనే వీలైనంత వరకు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం వ్యాయామాలు చేస్తుండాలి. ముఖ్యంగా ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని రక్తం మరింత సమర్థవంతం కావడానికి దోహదపడుతుంది కనుక వ్యాయామం తప్పనిసరి.

మన శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా పని చేయడానికి విటమిన్ డి ఎంతో దోహదపడుతుంది. ఈ విటమిన్ డి ఎప్పుడైతే మన శరీరంలో తక్కువగా ఉంటుందో మన రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం సూర్యరశ్మి మనపై పడేలా చూసుకోవాలి. అదేవిధంగా పోషక పదార్థాలు కలిగిన తగ్గించాలి ధాన్యాలను తీసుకోవటంవల్ల మన శరీరంలో కావలసినంత రోగనిరోధకశక్తి ఏర్పడుతుంది. కనుక మన శరీరంలోని రోగ నిరోధక శక్తి సరైన క్రమంలో పని చేయాలంటే నిద్ర విషయంలో, శరీర వ్యాయామాల విషయంలో, ఆహార విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఎంతో ఆరోగ్యంగా ఉండగలము.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago