ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా మహమ్మారి తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు తమ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం పడని పాట్లు లేవు.మన శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉంటేనే కరోనా వైరస్ నుంచి మనం మనల్ని కాపాడుకోగలం. అయితే మనం రోజువారి పనులలో భాగంగా చేసే చిన్న చిన్న పొరపాట్లు వల్ల భవిష్యత్తులో ఎన్నో రకాల జబ్బుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

మన శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తి మెరుగ్గా పనిచేయాలంటే సైటోకిన్‌లను విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రోటీన్ కేవలం మనం నిద్ర పోయినప్పుడు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కనుక మన శరీరంలో రోగ నిరోధక శక్తి పనితీరు మెరుగ్గా ఉండాలంటే తప్పనిసరిగా సరైన నిద్ర ఉండాలి. ప్రస్తుత కాలంలో చాలా మంది మొబైల్ ఫోన్లలో కాలక్షేపం చేస్తూ నిద్రను దూరం చేసుకుంటున్నారు.
తరుచూ అధిక ఒత్తిడి ఆందోళనకు గురి కావడం వలన మన శరీరంలో రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలోనే వీలైనంత వరకు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం వ్యాయామాలు చేస్తుండాలి. ముఖ్యంగా ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని రక్తం మరింత సమర్థవంతం కావడానికి దోహదపడుతుంది కనుక వ్యాయామం తప్పనిసరి.
మన శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా పని చేయడానికి విటమిన్ డి ఎంతో దోహదపడుతుంది. ఈ విటమిన్ డి ఎప్పుడైతే మన శరీరంలో తక్కువగా ఉంటుందో మన రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం సూర్యరశ్మి మనపై పడేలా చూసుకోవాలి. అదేవిధంగా పోషక పదార్థాలు కలిగిన తగ్గించాలి ధాన్యాలను తీసుకోవటంవల్ల మన శరీరంలో కావలసినంత రోగనిరోధకశక్తి ఏర్పడుతుంది. కనుక మన శరీరంలోని రోగ నిరోధక శక్తి సరైన క్రమంలో పని చేయాలంటే నిద్ర విషయంలో, శరీర వ్యాయామాల విషయంలో, ఆహార విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఎంతో ఆరోగ్యంగా ఉండగలము.


































