ఈ పచ్చడితో 300 వ్యాధులు దూరం!!
మన చుట్టూ ఉన్న ఆకులు, కాయల్లోనే ఎన్నో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. ఎన్నో మొండి వ్యాధులను నయం చేయగలిగిన లక్షణాలున్నాయి. అంతేకాదు వాటిని మన వంటల్లో భాగం చేసుకోవడం వల్ల కొన్ని వ్యాధుల ముప్పు కూడా తప్పిపోతుంది. అందులో ఇప్పుడు తెలుసుకోబోయే ఆకు కూడా ఒకటి. సాధారణంగా మునగ కాయలతో ఇగురు కూరలు చేసుకోవడం మనకు తెలుసు. మునగ కాయలు సాంబారులోనే ఎక్కువగా వేస్తారు. అలాగే పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. మునగ కాయలే కాకుండా ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ముఖ్యంగా..
మనం తినే ఏ ఆకు కూరల్లోనూ లేనన్ని ఆరోగ్య గుణాలు మునగ ఆకులో ఉన్నాయి. అన్నికాలాల్లో దొరికే ఈ మునగాకును ఆహారంలో భాగం చేసుకుంటే మనం తరచూ ఎదుర్కొనే చిన్న చిన్న వ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది. దీంట్లో విటమిన్ ఎ అధికంగా ఉండడం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా చేస్తుంది. బరువు లావు తగ్గాలనుకునేవారికి మునగాకు బాగా ఉపయగపడుతుంది. దీనిలోని విటమిన్ సి ఎముకలను బలపరుస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సిలే కాకుండా క్యాల్షియం, ఐరన్ ఫాస్పరస్ ఎక్కువ గా ఉంటాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకును పచ్చడి లేదా కూర చేసుకుని తింటే..
జీర్ణశక్తిని పెంచుతుంది. మదుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అయితే ఇన్ని ఔషద గుణాలున్న మునగాకు పచ్చడి ఎలాతయారు చేయాలో చూద్దాం. ఒక పాన్ లో కొంచెం నూనె వేసి వేడిగా అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, వెల్లుల్లి, ధనియాలు, పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా వేయించి తీసి ఒక బౌల్ లో పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత రెండు కప్పుల మునగాకు అదే పాన్ లో కొంచెం నూనె వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ముందు వేంపిన దినుసులన్నీ వేసి మిక్సి పట్టి ఆ తరువాత మునగాకు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి వేసి తాలింపు పెట్టి రబ్బుకున్న పచ్చడి అందులో వేసి కలిపి దించేయాలి. ఇలా చేసిన పచ్చడిని ఈ సీజన్ లో తరచుగా తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…