ఆనాడు పౌరాణిక చిత్రాలు అద్భుతంగా ప్రదర్శింపబడుతున్న రోజుల్లో జానపద చిత్రాలు కూడా విడుదలయ్యేవి. అలా 1951లో ఎన్టీ.రామారావు నటించిన అద్భుత కళా ఖండం, బి.నాగిరెడ్డి నిర్మించిన జానపద చిత్రం, కె.వి.రెడ్డి మలిచిన ఓ దృశ్యకావ్యం, పింగళి నాగేంద్రరావు మాటల మంత్రదండం పాతాళ భైరవి. భవిష్యత్తులో అనేక జానపద చిత్రాలు రావడానికి అఖండ విజయం సాధించిన పాతాళభైరవి చిత్రమే మూలాధారం. ఆ తర్వాత అనేక జానపద చిత్రాల్లో ఎన్టీ.రామారావు, కాంతారావు నటించడం జరిగింది.
ఎన్టీ రామారావు గండికోట రహస్యం, చిక్కడు దొరకడు, కంచుకోట, కదలడు వదలడు, చిక్కడు దొరకడు, ఎర్ర కోట వీరుడు, పిడుగు రాముడు, మర్మయోగి, జై సింహ, భువనసుందరి కథ లాంటి జానపద చిత్రాల్లో నటించడం జరిగింది. 1977లో ఎన్టీ.రామారావు సొంత దర్శకత్వంలో లో ఆయన త్రిపాత్రాభినయం చేస్తూ దాన వీర శూర కర్ణ చిత్రం తీస్తున్న సమయంలో మరోపక్క నటశేఖర కృష్ణ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కురుక్షేత్రం సినిమా తీయడం జరిగింది. అప్పట్లో ఎన్టీ.రామారావు కు పోటీగా కృష్ణ కురుక్షేత్రం తీస్తున్నారని సినీ పరిశ్రమ ప్రముఖులు చెప్పుకున్నారు. ఆ సమయంలోనే ఎన్టీ రామారావు, కృష్ణ మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. ఆ తర్వాత 1978లో తిరుపతి ప్రొడక్షన్స్ లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు, వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా సింహబలుడు తీస్తున్న సమయంలో.. గిరి బాబు నిర్మాణ సారధ్యం, కొమ్మినేని దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, లత హీరో హీరోయిన్లుగా మరో జానపద చిత్రం సింహగర్జన చిత్రం షూటింగ్ జరుపుకోవడం ఓ విశేషం.
అయితే ఈ రెండు జానపద చిత్రాలు తమ సొంత బ్యానర్ లో నిర్మించక పోవడం ఓ విశేషం. సింహబలుడు చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న వాణిశ్రీని ‘సింహగర్జన’ చిత్ర యూనిట్ వెళ్లి కలిసి, తమ చిత్రంలో నటించాల్సిందిగా కోరడం జరిగింది. ‘సింహబలుడు’ చిత్రంలో నటిస్తుండటంతో.. తిరిగి మరొక జానపద చిత్రంలో నటించడం వీలు కాదని వాణిశ్రీ చెప్పడంతో నిర్మాత గిరిబాబు లత అనే హీరోయిన్ ని కృష్ణ సరసన సింహ గర్జన చిత్రానికి బుక్ చేసుకున్నారు. అయితే ఈ రెండు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో సినీ పరిశ్రమ వర్గాలను, ఇటు ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురిచేశాయి.. ఇలాంటి ఉద్రిక్త వాతావరణం తన సినిమా భవిష్యత్తుకు అవరోధంగా ఉంటుందని నటుడు, నిర్మాత గిరిబాబు ఒక రోజు ఉదయం ఎన్టీరామారావు ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్ళాడు.
అక్కడ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు పుండరీకాక్షయ్య అశ్వినీదత్ మొదలగువారు ఉన్నారు. గిరిబాబు అక్కడికి రావడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. గిరిబాబును చూసిన ఎన్టీ.రామారావు ఏం బ్రదర్.. ఎలా ఉన్నారని పలకరించారు. అప్పుడు గిరిబాబు మాట్లాడుతూ మీరు తీస్తున్న సింహబలుడుకి మేము తీస్తున్న సింహగర్జనకు ఏం సంబంధం లేదు, అలాగే మీ సినిమాలో మీరే సోలో హీరో, మా సినిమాలో ఇద్దరు హీరోలు, రెండు ఒకటే జోనర్ అయినప్పటికీ కథాపరంగా కూడా రెండు భిన్నమైన సినిమాలని గిరిబాబు చెప్పడంతో ఎన్టీ.రామారావు ఓకే బ్రదర్.. సినిమా బాగా తీయండి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి గిరిబాబును పంపించడం జరిగింది. అలా గిరిబాబు వెళ్లి మాట్లాడడంతో ఎన్టీ.రామారావు, కృష్ణ అభిమానుల మధ్య ఉత్కంఠ, ఉద్రిక్త వాతావరణం చల్లబడింది. సింహబలుడు, సింహగర్జన రెండు చిత్రాలు దాదాపు 15 రోజుల గ్యాప్ లో 1978లో విడుదలై ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…