Categories: FeaturedGeneral News

కల్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకోండిలా.. అందరికి షేర్ చేయండి.

18 సంవత్సరాలు నిండిన దళిత, గిరిజన, ముస్లీం, సిక్ అమ్మాయికి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అమ్మాయి తరపు వారికి రూ.75,116 వేలు మంజూరు చేస్తున్నారు. ఈ పథకం 2014, అక్టోబర్ 2 నుంచి అమలులోకి వచ్చింది. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు https://telanganaepass.cgg.gov.in/KalyanLakshmi.do అను వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. –

* తెలంగాణ రాష్ర్టానికి చెందిన వారు మాత్రమే అర్హులు.
* దరఖాస్తుదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన వారై ఉండాలి.
* కుటుంబ వార్షిక ఆదాయం 2,00,000లకు మించరాదు.
* అమ్మాయి వయస్సు వివాహ సమయానికి 18 సంవత్సరాలు నిండాలి.
* ఈ పథకం అమలులోకి వచ్చిన నాటి (2014, అక్టోబర్ 2) నుంచి జరిగే వివాహాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
* మీ సేవ కేంద్రాలు, ఏదైనా ఇంటర్‌నెట్ కేఫ్‌లలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.
* ఈ కింద తెలిపిన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి దరఖాస్తు ఫారానికి జత చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్లు అన్నీ మీ సేవ ద్వారా సంబంధిత అధికారి జారీ చేసినవై ఉండాలి.

దరఖాస్తుకు జతపర్చాల్సిన పత్రాలు…

l వధూవరుల వయస్సు ధ్రువీకరణ కోసం ఎస్సెస్సీ మెమో (చదువుకున్న వారైతే) దరఖాస్తుకు జతపర్చాలి. చదువుకోని వారైతే పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్)
* కుల ధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికెట్)
* ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కాం సర్టిఫికెట్)
* నివాస ధ్రువీకరణ పత్రం (రెసిడెన్సీ సర్టిఫికెట్)
(వివాహం జరిగిన తేదీ నాటికి మీ సేవ ద్వారా సంబంధిత అధికారి జారీ చేసినదై ఉండాలి)
* ఆధార్ కార్డు (వధువు, వరుడు ఇద్దరివి)
* బ్యాంకు ఖాతా (వధువు పేరు మీద జారీ చేసిన ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకు రావాలి)

telugudesk

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

20 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

20 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

20 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

20 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

20 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

20 hours ago