అత్తగారికి నమస్కారాలు….
కొత్తగా పెళ్లైన నామీద మీరు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు…ఈ ఆదరాభిమానాలే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీరు చేసే ఏ పనిలో తలదూర్చనని హామి ఇస్తున్నాను, మీ పనులను మీరు నిర్మొహమాటంగా చేసుకోవొచ్చు అందులో నాకెలాంటి అభ్యంతరం లేదు… బట్టలుతకడం, ఇల్లు ఊడ్వడం, వంట చేయడం, గిన్నెలు తోమడం..ఇలాంటవి గతంలో ఎలా చేసుకునే వారో ఇప్పుడు కూడా అలాగే చేసుకోండి కోడలిగా మీకు నేను అడ్డు చెప్పను.! ఎందుకంటే అత్తకు అనుభవం ఎక్కువ కదా!!!
నాకు మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఉంది…మొన్న మీరు చేసి ఇచ్చిన కాఫీ చాలా బాగుంది.రోజూ అలాంటిది ఉదయం 8 గంటలకోసారి ఇస్తే చాలు..అత్తచేతి కాఫీ అమృతం అని ఫీల్ అవుతూ మీరు చచ్చేదాకా హ్యాపీ గా బతికేస్తా!!
టిఫిన్ కోసం ఓ తెగ హైరానా పడిపోకండి… ఉదయం 6 ఇడ్లీలు తప్ప ఎక్కువ తినను లేండీ, కాకపోతే పల్లీ చెట్ని కాస్త టేస్ట్ గా ఉండాలి, చట్నీ రోటి మీద రుబ్బిందైతే మస్త్ ఉంటది, అయినా మీలాంటోళ్ళకు కొత్తగా చెప్పాలా…? అదొక్కడి చూసుకోండి.!!
నేను పెద్దగా నాన్ వెజ్ తినను….సండే ఒక్క రోజు బిర్యానీ వండిపెడితే చాలు… బొక్క కొరికే ప్రతిసారి ముక్క నమిలే ప్రతిసారీ అత్తను తల్చుకోనూ!! మసాలాలు మస్ట్!!
నేను వచ్చాక కూడా బీరువా తాళాలా గుత్తి మీ దగ్గర ఉండడం మంచిదికాదత్తయ్యా.! అయినా మీరు అంతంత బరువు మోయొద్దు, పైగా డబ్బుల వ్యవహారమాయే…. అసలే మీకు BP ఉండే ..సో ఇప్పటి నుండి దాని బాధ్యత నేను చూసుకుంటా.!
అప్పుడప్పుడు అంటే వారానికి 5 రోజులు నా పుట్టింటి తరఫు బంధువులు వస్తుంటారు. మీ తరఫు బంధువులు ఎక్కువగా మన ఇంటికి రాకుండా చూసుకుందాం.! ఎందుకంటే ఇద్దరి తరఫు వారు వస్తే మనకు కాస్త ఇబ్బంది కదండీ!!
ఇప్పటి వరకు అమ్మా..అమ్మా …అని మీ చుట్టూ తిరిగిన మీ కొడుకుని ఇప్పటి నుండి నా చుట్టే తిప్పుకుంటా..? ఎందుకంటే ఇప్పుడైనా మామగారికి మీ తోడు అవసరం కదా అత్తయ్యా.!
ఇక ఉంటా అత్తగారు…అషాడం అవ్వగానే కార్ తో పాటు మా ఆయనను పంపిించండి! పనిలో పనిగా వస్తూ వస్తూ మా ఆయనను ఓ 2 లక్షలు తీసుకురమ్మనండి, మా చెల్లి పెళ్ళి కట్నానికి కాస్త తక్కువ పడ్డాయ్.! అయినా మా చెల్లి అంటే మీకు కోడలు కాదా! ఏంటీ!!
ఇట్లు.
అత్తకు ప్రేమతో …
మీ కోడలు కాసుల కామేశ్వరీ
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…