Featured

కె.విశ్వనాథ్ సెంటిమెంట్ ను అక్కినేని ఎందుకు బ్రేక్ చేయాలనుకున్నారు.?

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవన్నమాట ఎంత నిజమో..దర్శకులు కె విశ్వనాథ్ గారి సెంటిమెంట్స్ కి నాగేశ్వర రావుగారి ఆలోచనకి కొన్ని విషయాలలో పొంతన ఉండదన్నది అంతే నిజం. అక్కినేని నాగేశ్వర రావు గారు చదువు లేకపోయినా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఏదైనా కష్టంతోనే సాధ్యం అన్నది ఆయన పాలసీ. కమర్షియల్ హీరోగా అక్కినేని ఎంతటి పాపులారిటి సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయి..ఆస్తిలో వారికి వచ్చిన 3 వేల రూపాయల ఆస్తితో జీవితం ప్రారంభించి …చదువుకోసం ఆ డబ్బు ఖర్చు చేస్తే ఒకవేళ చదువు అబ్బకపోతే తర్వాత పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో చిన్నతనంలోనే చదువుకు స్వస్తి చెప్పారు.

పదేళ్ళపాటు నాటకాలు వేసి మంచి పేరు తెచ్చుకున్న అక్కినేని సినిమా అవకాశాల కోసం మద్రాసు చేరుకున్నారు. ఆయనవద్దకి వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అతికొద్దికాలంలోనే హీరోగా నిలదొక్కుకొని క్షణం తీరికలేనంతగా షూటింగులు చేశారు. కొన్ని సందర్భాలలో ఆయన రెమ్యునరేషన్ ఎంతో మాట్లాడుకునే సమయం కూడా ఉండేది కాదు. అంతగా బిజీ అయ్యారు. కేవలం దర్శకుల మీద నమ్మకంతో సినిమాను ఒప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కినేనికి ఆదుర్తి సుబ్బారావుగారి ద్వారా కె విశ్వనాథ్ పరిచయం అయ్యారు. అక్కినేని ఎవరినైనా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

నాగేశ్వరరావు నటించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు.

అలా ఆయన దృష్ఠిలో పడిన దర్శకులు కె. విశ్వనాథ్ గారు. ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన మొదట సౌండ్ రికార్డిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఆ సమయంలో ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు పరిచయం కావడంతో ఆయన వద్ద కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డును సాధించారు. కె విశ్వనాథ్ మొదటి సినిమాకి గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి, భమిడిపాటి రాధాకృష్ణ, దుక్కిపాటి మధుసూదనరావు లాంటి వారితో పనిచేయడంతో మంచి టీం ఏర్పడింది.

ఆ తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరిసిరిమువ్వ సినిమా పెద్ద విజయాన్ని సాధించడంతో చిత్ర పరిశ్రమలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 1978 లో కె. విశ్వనాథ్ రచన దర్శకత్వంలో రూపొందిన సీతామాలక్ష్మి మరో మెట్టు పైకెక్కించింది. ఈ సినిమా ద్వారా తాళ్ళూరి రామేశ్వరి చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. అంతేకాదు ఈ సినిమాలో నటనకు గాను ఆమె నంది అవార్డును గెలుచుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని తమిళంలో ఎనిప్పడిగళ్ పేరుతో, 1980 లో హిందీలో మిథున్ చక్రవర్తి, జరీనా వాహబ్ లతో సితార పేరుతో నిర్మించారు. ఈ రెండు భాషల్లోను సూపర్ హిట్ గా నిలిచింది.

‘ఎస్’ అనే అక్షరం కె విశ్వనాథ్ కి సెంటిమెంట్.

ఇలా కె విశ్వనాథ్ గారు దర్శకుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలను తీస్తూ వచ్చారు. ఆయనకి సినిమా టైటిల్స్ విషయంలో చాలా సెంటిమెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ‘ఎస్’ అనే అక్షరం ఆయనకి సెంటిమెంట్. అందుకే ఆయన సినిమాల టైటిల్స్ అన్నీ ఎస్ అనే అక్షరంతో మొదలవుతాయి. ఇది ఆయన సక్సెస్ సీక్రెట్‌గా భావించారు. కొన్ని సినిమాలు ఎస్ అనే అక్షరం లేకపోవడంతోనే ఫ్లాప్ అయ్యాయని భావన కూడా ఆయనలో ఉండేది. ఇదే సెంటిమెంట్ విషయంలో ఓసారి సన్నివేశం తీయాలనుకున్నప్పుడు అక్కినేని వల్ల అది బ్రేక్ అవుతుందేమో అనుకున్నారట.

లక్ష్మీదేవీ విగ్రహం ముందు దణ్ణం పెట్టుకుంటూ ఉండే షాట్ ని అక్కినేని మీద తీయాలనుకున్నారు. కానీ అక్కినేనికి ఈ విషయం ఎలా చెప్పాలో అని ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో వచ్చిన ఓ ఆలోచన ఏమాత్రం ఆలోచించకుండా షాట్ తీయడానికి అప్లై చేశారు. చిన్న మార్పు చేసి నాగేశ్వరరావు వచ్చి అద్దం ముందు నుంచొని దువ్వెనతో తల దువ్వుకుంటూ ఓ డైలాగ్ చెప్పేలా తీశారు. ఇక్కడ అద్దం అంటే లక్ష్మీదేవి. నాగేశ్వరరావుకి తెలియకుండా కె.విశ్వనాథ్ గారు తన సెంటిమెంట్ బ్రేక్ అవకుండా చూసుకున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

2 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

2 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

2 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

2 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

2 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

3 hours ago