Categories: FeaturedGeneral News

వీళ్ళ తెలివి మామూలుగా లేదు..గాజులలో 7.5 కోట్ల హెరాయిన్ రవాణా!

డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను రవాణా చేస్తూ పట్టుబడకుండా ఉండటం కోసం దుండగులు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇదివరకు ఈ విధంగా మాదకద్రవ్యాలను ఎన్నో రకాలుగా రవాణా చేస్తూ అధికారులకు పట్టుబడిన దుండగులు తాజాగా మరోసారి హెరాయిన్ ను గాజులలో రవాణా చేస్తున్నట్లు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ హెరాయిన్ విలువ సుమారు 7.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలియజేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ హెరాయిన్ ను సన్నని పైపులలోకి పెట్టి వాటిని గాజులు లాగా చుట్టి రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ హెరాయిన్ ను దక్షిణాఫ్రికా నుంచి డిల్లీలోని ఓ చిరునామాకు దిగుమతి చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలోనే వీటికి సంబంధించిన ఫోటోలను కస్టమ్స్ అధికారులు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

ఈ క్రమంలోనే అధికారులు మాట్లాడుతూ గత వారంలో దక్షిణాఫ్రికా దేశస్తులు ఏకంగా 126 కిలోల హెరాయిన్‌ను స్మగ్లింగ్‌ చేస్తూ దిల్లీ కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ విధంగా హెరాయిన్‌ను గాజులలో పెట్టె స్మగ్లింగ్ చేస్తున్న పార్సిల్ ను అధికారులు గుర్తించి అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఫోటోలు చూసిన నెటిజన్లు వీళ్ళ తెలివి మామూలుగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago