Categories: FeaturedGeneral News

భర్తతో విడిపోయిన భార్య..కొన్నాళ్ళకు తన భర్త తండ్రిని వివాహం చేసుకుంది.. కానీ చివరికి?

ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..కొద్ది రోజులు సుఖంగా సాగిన వారి సంసారంలో కొన్ని విభేదాలు రావడంతో తన భర్తతో విడాకులు తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.ఆమె వెళ్ళిపోయిన కొన్ని రోజులకు తన తండ్రి కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన తండ్రి ఆచూకీ కోసం ఫిర్యాదు చేసిన కొడుకు దిమ్మతిరిగే నిజం బయటపడింది.తనతో విడాకులు తీసుకున్న భార్య తన తండ్రిని పెళ్లి చేసుకుని భార్య స్థానం నుంచి సవతి తల్లి గా మారిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బదాయూ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

2016వ సంవత్సరంలో ఓ వ్యక్తి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆరునెలల పాటు ఎంతో సుఖంగా సాగిన వారి సంసారంలో అభిప్రాయభేదాలు వచ్చాయి. తరచు వారిరువురు ఏదో ఒక కారణం చేత గొడవ పడేవారు.ఈ క్రమంలోనే తన భర్త తాగుడును భరించలేకపోతున్నానని సదరు యువతి విడాకులను తీసుకుంది.విడాకులు ఇచ్చినప్పటికీ తిరిగి తన భర్త భార్యతో కలిసి జీవించాలని ప్రయత్నించాలని చూసిన ఆమె నిరాకరించింది.

ఈ విధంగా తన భార్య విడాకులు తీసుకున్న కొంతకాలానికి తన తండ్రి కూడా ఇంటి నుంచి మాయమయ్యాడు. ఈ క్రమంలోనే తన తండ్రి ఆచూకీ కోసం ఆ కొడుకు జిల్లా పంచాయతీ అధికారులను ఆశ్రయించాడు. తన తండ్రి వివరాలు సేకరించాలని ఆర్​టీఐ దాఖలు చేశాడు. ఇక్కడే అసలు ఈ విషయం బయటపడింది. తన తండ్రి తాను విడాకులు ఇచ్చిన భార్యను పెళ్లి చేసుకుని సంభాల్​ ప్రాంతంలో కలిసి జీవిస్తున్నారని తెలియడంతో ఆ కొడుకు దిమ్మతిరిగిపోయింది.

తనకు భార్యగా ఉండాల్సిన ఆమె తన తండ్రిని పెళ్లిచేసుకుని సవతి తల్లిగా మారింది అన్న విషయం తెలియగానే అతని నోట మాట రాలేదు. క్రమంలోనే పోలీసులు వీరిని పిలిచి పంచాయతీ పెట్టగా సదరు యువతి తన మొదటి భర్త కన్నా తన రెండవ భర్తతో తనకు సుఖంగా ఉందని మొదటి భర్త దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదని ఆ మహిళ తేల్చి చెప్పడం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago