ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..కొద్ది రోజులు సుఖంగా సాగిన వారి సంసారంలో కొన్ని విభేదాలు రావడంతో తన భర్తతో విడాకులు తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.ఆమె వెళ్ళిపోయిన కొన్ని రోజులకు తన తండ్రి కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన తండ్రి ఆచూకీ కోసం ఫిర్యాదు చేసిన కొడుకు దిమ్మతిరిగే నిజం బయటపడింది.తనతో విడాకులు తీసుకున్న భార్య తన తండ్రిని పెళ్లి చేసుకుని భార్య స్థానం నుంచి సవతి తల్లి గా మారిన ఘటన ఉత్తర్ప్రదేశ్ బదాయూ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

2016వ సంవత్సరంలో ఓ వ్యక్తి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆరునెలల పాటు ఎంతో సుఖంగా సాగిన వారి సంసారంలో అభిప్రాయభేదాలు వచ్చాయి. తరచు వారిరువురు ఏదో ఒక కారణం చేత గొడవ పడేవారు.ఈ క్రమంలోనే తన భర్త తాగుడును భరించలేకపోతున్నానని సదరు యువతి విడాకులను తీసుకుంది.విడాకులు ఇచ్చినప్పటికీ తిరిగి తన భర్త భార్యతో కలిసి జీవించాలని ప్రయత్నించాలని చూసిన ఆమె నిరాకరించింది.
ఈ విధంగా తన భార్య విడాకులు తీసుకున్న కొంతకాలానికి తన తండ్రి కూడా ఇంటి నుంచి మాయమయ్యాడు. ఈ క్రమంలోనే తన తండ్రి ఆచూకీ కోసం ఆ కొడుకు జిల్లా పంచాయతీ అధికారులను ఆశ్రయించాడు. తన తండ్రి వివరాలు సేకరించాలని ఆర్టీఐ దాఖలు చేశాడు. ఇక్కడే అసలు ఈ విషయం బయటపడింది. తన తండ్రి తాను విడాకులు ఇచ్చిన భార్యను పెళ్లి చేసుకుని సంభాల్ ప్రాంతంలో కలిసి జీవిస్తున్నారని తెలియడంతో ఆ కొడుకు దిమ్మతిరిగిపోయింది.
తనకు భార్యగా ఉండాల్సిన ఆమె తన తండ్రిని పెళ్లిచేసుకుని సవతి తల్లిగా మారింది అన్న విషయం తెలియగానే అతని నోట మాట రాలేదు. క్రమంలోనే పోలీసులు వీరిని పిలిచి పంచాయతీ పెట్టగా సదరు యువతి తన మొదటి భర్త కన్నా తన రెండవ భర్తతో తనకు సుఖంగా ఉందని మొదటి భర్త దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదని ఆ మహిళ తేల్చి చెప్పడం గమనార్హం.































