ప్రముఖ నటుడు, ఉద్యమ సినిమాల డైరెక్టర్ కం హీరో ఆర్ నారాయణ మూర్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజగా కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపద్యంలో రైతుల ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్ ప్రాంతంలో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం జరిగింది. ఆ ర్యాలీలో పాల్గొన్నారు ఆర్ నారాయణ మూర్తి. అయితే రాజ్ భవన్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడకి వెళ్లేందుకు అనుమతి లేదని వారిని అడ్డుకుని తిరిగి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అయితే వారు వెనక్కి వెళ్లేందుకు నిరాకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అరెస్ట్ అయిన ఆందోళనకారులలో ఉద్యమ సినిమాల హీరో నారాయణ మూర్తి కూడా ఉన్నారు.
ఈ నేపధ్యంలో ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ… కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఇలానే 2006లో బీహార్ రాష్ట్రంలో కూడా కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చారు. ఆ చట్టం వల్ల అసలు అక్కడ రైతులే లేకుండా పోయారు. అక్కడి రైతులు అందరూ కూలీలుగా మిగిలి పోయారు. అందుకే కేంద్రం ఆ మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. వ్యవసాయం, విద్యా, వైధ్యం ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను కేంద్రం మానుకోవాలని ఆయన పేర్కొన్నాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…