జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు రాజీనామా చేశారు, ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పంపారు. ఇందులో జేడి ఈ విధంగా పేర్కొన్నారు. మీరు పూర్తీ జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తానని, తిరిగి సినిమాలలో నటించానని మీరు పూర్వం చాలా సార్లు చెప్పారు. అయితే ఇప్పుడు మీరు తిరిగి సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా మీ విధానాల్లో నిలకడ లేదని తెలుగుస్తుంది. కావున నేను జనసేన పార్టీ నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నావెంట నడిచిన ప్రతి కార్యకర్తకి, నాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు నా కృతఙ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జనసైనికులకు, కార్యకర్తలకు మరియు పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియచేస్తున్నాను. ఇన్నాళ్లు నాతో నడిచిన వారందరికీ, మరియు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లపుడు మంచి జరగాలని, ఆ భగవంతుడి కృప మీ మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు అని పేర్కొన్నారు.
అయితే ఈయన రాజీనామాను జనసేన అధక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదించారు. ఈ మేరకు జనసేన తన ట్విట్టర్ ఖాతాలో ఓక పోస్టు పెట్టింది. ” శ్రీ వి. వి. లక్ష్మీ నారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాము. అయన రాజీనామాను ఆమోదిస్తున్నాము. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవి లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాదు. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నామీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి. వారికోసం, నాకుటుంబం కోసం, పార్ట్ ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణగారు తెలుసుకుని అయన రాజీనామాలో ప్రస్తావించి ఉంటె బాగుండేది. శ్రీ లక్ష్మీనారాయణ గారు పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు, ఆయనపై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు నా శుభాబినందనలు.” అంటూ పేర్కొన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు రాజీనామా చేశారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. విశాఖ పార్లమెంట్ స్థానానికి జేడీ పోటీ చేసి దాదాపు 3 లక్షల ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున నిర్వహించిన విశాఖ లాంగ్ మార్చికి జేడీకి పిలుపు లేదు. దాంతో పాటుగా ఇటీవల జనసేన, బీజేపీ పొత్తు విషయంలో లక్ష్మీనారాయణను ఏమాత్రం అభిప్రాయం తీసుకోలేదని అంటున్నారు. మరియు జనేసేన – బీజేపీ పొత్తుపై కూడా జేడీ ఆగ్రహంగా ఉన్నారని వినికిడి.
దర్శక దిగ్గజం భారతీరాజా మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఈ ఉదయం అనారోగ్య…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కొనసాగుతున్న…
అమెరికాలో కోట్ల రూపాయల జీతం అంటే అందరూ కలల ప్రపంచంలోకి వెళ్లిపోతారు. కానీ ఆ సంపాదన వెనుక ఉన్న ఖర్చులు…
నిద్ర ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో వైద్య నిపుణులు తరచుగా చెబుతూనే ఉంటారు. సరైన నిద్ర లేకపోతే శరీరంతో పాటు మానసిక…
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన…
కేంద్ర రాజకీయాల్లో తాజా పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా…