తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కథ బాగుంటే కలిసి చేయడానికి ఇప్పటి హీరోలు పెద్దగా ఆలోచించడం లేదు. ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా అంటేనే జనాలు ఓరేంజ్ లో అంచనాలు పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు ఒకే ఇంట్లోంచి వచ్చిన ఇద్దరు స్టార్ లు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది. అది కూడా బాబాయ్ – అబ్బాయి ల కాంబినేషన్ అంటే ఇక నందమూరి అభిమానులకు కనులవిందే. ఇప్పుడు అదే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అదే నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఒకే సినిమాలో నటించడం. ఇదివరకే నందమూరి హీరోలు ఒక ఫ్రెమ్ లో చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. కానీ దానికి తగ్గ కథ కోసం చాలా మంది దర్శకులు అన్వేషించారు. అయితే ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ బాబాయ్ – అబ్బాయ్ లతో సూపర్ కథని రెడీ చేసాడు అని వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇదివరకే మరో అబ్బాయ్ కళ్యాణ్ రామ్ తో కలిసి “ఎన్టీఆర్ బయోపిక్” లో నటించిన బాలయ్య, ఎన్టీఆర్ తో కలిసి ఎప్పుడు నటిస్తాడా అని అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా సంక్రాంతికి రిలీజ్ అయిన “అలా… వైకుంఠపురములో” చిత్రంతో భారీ హిట్ కొట్టాడు త్రివిక్రమ్. ప్రస్తుతం సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న త్రివిక్రమ్. మరోపక్క ఎన్టీఆర్ తో మరో సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నాడు. దీనికి సంబందించి ఇప్పటికే ఎన్టీఆర్ కి కథ లైన్ వినిపించాడని, విని వినగానే ఎన్టీఆర్ సినిమా చేయడానికి అంగీకరించాడట. అయితే ఈ సినిమాకి “అయినను.. పోయిరావలె హస్తినకు” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రస్మిక మందన్న కథానాయికగా నటిస్తోందట. హారిక హాసిని క్రేయేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయట.
ప్రస్తుతం “RRR” చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్, ఆ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఈ చిత్రాన్ని మొదలు పెట్టనున్నాడట. గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషలో “అరవింద సామెత.. వీర రాఘవ” చిత్రం సూపర్ హిట్ అందుకుంది. అయితే అటు బాలకృష్ణ కూడా బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాలకృషం డ్యూయల్ రోల్ చేయనున్నాడని సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…