Featured

త్రిష పనైపోయింది.. ఇక అలాంటి పాత్రలే చేయాలేమో..!

సీనియర్ హీరోయిన్ త్రిష పనైపోయిందా.. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ముఖ్యంగా తెలుగులో త్రిషకు ఇక అవకాశాలు దక్కడం చాలా కష్టం అని చెప్పుకుంటున్నారు. ఒక రకంగా ఈ టాక్ గతంలోనే వచ్చింది. కానీ, త్రిష అదృష్ఠం కొద్దీ తమిళంలో 96 సినిమా పడింది. ఈ సినిమాలో టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి త్రిషకు జంటగా నటించాడు. అనూహ్యంగా 96 సినిమా యూత్ ఆడియన్స్‌ను మాత్రమే కాకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

96 సక్సెస్‌తో త్రిష మంచి కంబ్యాక్ అయింది. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న త్రిష అలాగే తమిళం నుంచి వరుసగా అవకాశాలు అందుకుంది. గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వం సినిమాలో త్రిష ఓ కీ రోల్ చేస్తోంది. ఈ సినిమా పార్ట్ 1 రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే దీని సీక్వెల్ లోనూ త్రిష నటిస్తోంది. ఇది పాన్ ఇండియన్ సినిమా. అన్నీ భాషలలో డబ్ అవుతుంది.

కాబట్టి పొన్నియన్ సెల్వన్ సీక్వెల్స్ కొంతవరకు త్రిషకు హెల్ప్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక మలాయళంలో ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పటికే తమిళంలో రాంగి, గర్జనై, సతురంగ వెట్టై సీక్వెల్ సినిమాలలో త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ మూడు సినిమాల షూటింగ్ కూడా పూర్తైంది. అంటే త్రిష చేతిలో ఉంది కొత్త ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. ఇవన్నీ లాక్ డౌన్ కి ముందే ఒప్పుకొన్నవి. అవే షూటింగ్ కంప్లీట్ చేసింది.

కొత్తగా చేయబోయేది అంటే మణిరత్నం తెరకెక్కించనున్న పొన్నియన్ సెల్వన్ సీక్వెల్ ఒక్కటే. అందుకే ఇకపై త్రిషకు హీరోయిన్‌గా కంటే అత్త పాత్రలకు అవకాశాలు వస్తాయనే టాక్ మొదలైంది. ఫేడౌవుట్ అయిన హీరోయిన్స్ అందరూ నటించానే కోరిక ఉంటే అత్త అమ్మ పాత్రలే దక్కుతాయి. ప్రస్తుతం తెలుగులో త్రిషకు అవకాశాలు సున్నా. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయింది.

ఈ సినిమా గనక చేసి ఉంటే మళ్ళీ తెలుగులో ఈ సీనియర్ హీరోయిన్‌కు అవకాశాలు దక్కేవేమో. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున లాంటి వారికి హీరోయిన్ సమస్య బాగా ఉంది. కాబట్టి దర్శక, నిర్మాతలు కాస్త ఆలోచిస్తే.. హీరోలు ఓకే చేస్తే త్రిషకు తెలుగులో అవకాశాలు తలుపు తడతాయి. లేదంటే ఇకపై నెమ్మదిగా టాలీవుడ్‌ను మర్చిపోవడమే. మరి హీరోయిన్‌గా అవకాశాలు రాకుంటే అత్త పాత్రలను చేస్తుందా అంటే అందుకు త్రిష ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago