మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం తన భర్త చైతన్యతో కలిసి వెకేషన్ మోడ్‌లో ఉంది. పెళ్లై ఏడాది అవబోతోన్న సందర్భంగా ఇలా వెకేషన్ ప్లాన్ చేశారు. మొత్తానికి నిహారిక మాత్రం స్పెయిన్, బార్సిలోనాలో దుమ్ములేపుతుంది. ఇటు నిర్మాతగా హిట్ కొట్టేసింది. ఓసీఎఫ్ఎస్ అనే వెబ్ సిరీస్ ఫుల్ స్పీడులో దూసుకుపోతోంది.
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మీద చిరంజీవి సైతం స్పందించాడు. అలా ఈ చిన్న ఫ్యామిలీ స్టోరీ పెద్ద హిట్ అయింది. మొత్తానికి నిహారిక చాలా రోజుల తరువాత ఓ సక్సెస్ వచ్చింది. నిర్మాతగా నిహారిక మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకుంది. అయితే ఇప్పుడు నిహారిక మాత్రం తన భర్తతో కలిసి వెకేషన్‌లో ఉంది.గత ఏడాది డిసెంబర్ 9న నిహారిక పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.
అలా మొదటి యానివర్సరీ స్పెషల్‌గా ఈ ట్రిప్‌ను ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. డిసెంబర్ మొదటి తేదీ నుంచి కూడా విదేశాల్లోనే ఉంటున్నారు. ఇక నిహారికకు వంటలు అంటే తెగ ఇష్టం. ఏ కొత్త వంట కనిపించినా.. దానిపై ప్రయోగం చేసి మరీ రుచి చూస్తుంది. వంటలో కూడా నిహారిక స్టైల్ ప్రత్యేకమనే చెప్పాలి. ఎవరికైనా బరువు తగ్గుతున్నారంటే.. మీల్స్ వాల్యూ అనేది తెలుస్తోంది. అదే ఇప్పుడు తనకు తెలుస్తుందని.. ఇప్పుడు తిన్నా కూడా.. వెంటనే మళ్లీ ఆకలి వేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.
దానికి తగ్గట్లుగానే బ్యాక్ గ్రౌండ్ లో ఇంగ్లీషులో ఓ పాట ప్లే చేస్తూ వివిధ చోట్ల రకరకాల ఫుడ్స్ టేస్ట్ చేస్తున్న వీడియోలను షేర్ చేసింది నిహారిక. ఆ వీడియో కింద ఆమె ‘‘ఎవడి ప్రాబ్లమ్స్ వాడికి ఉంటాయ్.. ఎవడి గోల ఆడిది.. ధన్యవాదాలు అంటూ’’ వీడియో కింద ట్యాగ్ చేస్తూ.. పోస్టు చేశారు. దీనిపై సెలెబ్రిటీలు సైతం కామెంట్లు చేశారు. నాకు ఇది చాలా నచ్చిందని.. రీతూ వర్మ రియాక్ట్ అయింది. నిహారికపై ఎంతో మంది నెటిజన్లు ప్రశంసల జల్లు కురించారు. ఈటింగ్ మిషన్ అంటూ పొగిడారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…