పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా దగ్గుబాటి లీడ్ క్యారెక్టర్లతో వస్తున్న పవర్ పుల్ మూవీ భీమ్లానాయక్.. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మళయాళంలో బంఫర్ విక్టరీ సాధించిన అయ్యప్పనుమ్ కోషియం రిమేక్ గా భీమ్లానాయక్ తెలుగులో రిమేక్ అవుతోంది.
ప్రుథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ పోటా పోటీగా నటించిన మళయాళం సినిమా అక్కడ రికార్డ్ కలెక్షన్లను సాధించింది. దీంతో తెలుగులో కూడా విపరీతంగా హైప్ క్రియేట్ అయ్యింది. తెలుగులో పవన్ కళ్యాన్, రానాలు పోటీపోటీగా కనిపించనున్నారు.
సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలను అందిస్తున్నారు. మరోవైపు థమన్ మ్యూజిక్ ఆల్ రెడీ హిట్ అయింది. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇప్పడు టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. భీమ్లానాయక్ అంటూ సాగే టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో మారుమోగిపోతోంది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది.
దీన్ని బట్టి చూస్తే పవన్ మాస్ ఇమేజ్ ఎంటో తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్వట్టర్ ద్వారా వెల్లడించింది. పవన్ ఇమేజ్ కు అనుగుణంగా ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాశారు. జనవరి 12 న సంక్రాంతి కానుగా భీమ్లానాయక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడులయిన తర్వాత మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…