Featured

అక్కడ పుష్ప సినిమాకు సెన్సార్ కష్టాలు.. ఆందోళనలో చిత్ర బృందం..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ మూవీ పుష్ప. ఈ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయనుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచానాలు ఉన్నాయి. ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో పుష్ప సినిమా విడుదల కాబోతోంది.

అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా ఊర మాస్ లుక్కులో కనిపిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మీక మందన్న డీగ్లామరస్ రోల్ లో అభిమానుల ముందుకు రానుంది. కాగా ఇప్పటికే చిత్ర యూనిట్ అన్ని భాషల్లో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. చెన్నై, బెంగళూర్, హైదరాబాదుల్లో ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. కాగా ఇప్పటికే తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ భాషల్లో సెన్సార్ ప్రక్రియ పూర్తయింది. కానీ ఇంకా హిందీలో సెన్సార్ పూర్తికాలేదని తెలుస్తోంది.

గత చిత్రాల మాదిరిగానే డైరెక్టర్ సుకుమార్ చివరి నిమిషం వరకు ఎడిటింగ్ చేయకపోవడంతో అక్కడ సెన్సార్ ప్రక్రియకు ఆలస్యం అయిందని తెలుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ హడావుడిగా ముంబైలో సెన్సార్ ప్రక్రియ పూర్తి చేస్తుందని సమాచారం. ఇవ్వాలే సెన్సార్ పూర్తయి.. సభ్యులు సినిమాను చూసి సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఒక వేళ సెన్సార్ పూర్తికాకపోతే హిందీలో విడుదలయ్యే అవకాశం ఆలస్యం కావచ్చనే అభిప్రాయం కూడా ఉంది.

కాగా పుష్పకు దక్షిణాది భాషల్లో పిచ్చ క్రేజ్ ఏర్పడగా.. హిందీలో మాత్రం అనుకున్నంతగా స్పందన రావడం లేదని సమాచారం. అక్కడ టికెట్ల అమ్మకాలు కూడా పెద్దగా సాగలేదని తెలుస్తోంది. ఇతర భాషల్లో మాత్రం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ సినిమాను తమిళ్ లో లైకా ప్రొడక్షన్స్, కన్నడలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్ రిలీజ్ చేస్తుండగా… హిందీలో ఏఏ ఫిల్మీంస్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. గతంలో బహుబలిని కూడా ఇదే సంస్థ పంపిణీ చేసింది. మరో వైపు ఈ రోజు హైదరాబాద్ కూకట్ పల్లిలోని మల్లికార్జున, భ్రమరాంబలో పుష్ప బెనిఫిట్ షోలు వేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago