Featured

నటుడు రంగనాథ్ చనిపోయే ముందు గోడ మీద ఏమని రాసారో తెలుసా ?

తెలుగు చిత్ర పరిశ్రమలో రంగనాథ్ గొప్ప నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీకి రాకముందు రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్‌గా కొంతకాలం పనిచేశారు. అయితే రంగనాథ్‌ ఫ్యామిలీలో ఎవరికీ సినీ నేపథ్యం లేదు. కానీ ఆయన అక్కినేని నాగేశ్వరరావుకి అభిమాని. ఆయన సినిమాలలో బాగా గమనించేది రియాక్షన్స్. నాగేశ్వరరావుగారు డైలాగ్స్ కి రియాక్షన్స్ అద్భుతంగా ఇస్తారు. నాకు అది కూడా ఒక ప్రేరణ అని రంగనాథ్ చెప్పారు.

కాగా రంగనాథ్ 1969లో బుద్ధిమంతుడు సినిమాతో వెండితెరకు పరిచయమై సుమారు 300 సినిమాలలో నటించారు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత 1974లో చందన అనే సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా రంగనాథ్ కి మంచి పేరు తెచ్చినప్పటికి కెరీర్ ప్రారంభంలో కుటుంబ బాధ్య‌తులు తనమీదే ఉండటంతో సినిమాలను కాద‌ని ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేశారు. బిఏ చ‌దువుతుండ‌గానే ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో టిసిగా ఉద్యోగం వ‌చ్చింది. అలా కొంతకాలం సినిమాలకి దూరమై రైల్వేలో టిసిగా ఉద్యోగం చేశారు.

అయితే బాపుగారు తెరకెక్కించిన అందాల రాముడు సినిమాలో రాముడి పాత్రతో పాటు, ‘చంద‌న’ సినిమాలో హీరోగానూ ఒకేసారి అవకాశాలు వ‌చ్చాయి. కానీ బాపుగారి స‌ల‌హా మేరకు చంద‌న సినిమాను ఒప్పుకున్నారు. అలా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రంగనాథ్ ‘పంతుల‌మ్మ’ అనే సినిమాతో స్టార్ హీరో అయ్యారు. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన రంగనాథ్ కి కెరీర్ ప్రారంభంలోనే పోటీ ఎక్కువై ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాంతో చేసేదేమీ లేక హీరో అవకాశాలు కాకపోయినా వచ్చిన పాత్రలను చేసి గుర్తింపు తెచ్చుకోవాలనే కారణంతో ‘గువ్వ‌ల జంట’ సినిమాతో మొదటిసారి విలన్ పాత్ర‌లో నటించారు. ఆ త‌రువాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గాను మెప్పించారు.

ఇలా కెరీర్ ప్రారంభంలోనే హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రంగనాథ్ ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలరని ఇండస్ట్రీలో చెప్పుకునేలా తన సత్తా చాటారు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, శోబన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, గిరిబాబు, ఎస్వీ రంగారావు, చంద్ర మోహన్, చిరంజీవి..లాంటి స్టార్ హీరోలతో కలిసి అన్నీ రకాల పాత్రల్లో నటించారు. వీరితో సినిమాలు చేసిన రంగనాథ్ అందరితో మంచి అనుబంధం ఏర్పరచుకున్నారు. రంగనాథ్ నటుడే కాదు మంచి రచయిత కూడా. అప్పట్లోనే రచయిత అందుబాటులో లేకపోతే కొన్ని సన్నివేశాలకి డైలాగ్స్ కూడా రాశారు. సినీ ప్రముఖుల మీద కవితలు రాశారు.

అయితే రంగనాథ్ మొదటి సినిమా తర్వాత ఒకేసారి తన మీద కుటుంబ బాధ్యతలు, ఇండస్ట్రీలో పోటీ ఎదురయ్యాయి. వీటిని తట్టుకోలేకనే కుటుంబ పోషణకొసం డబ్బు అవసరమై ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అయినా తనకి నటన మీద ఆసక్తి కోరిక మాత్రం చచ్చిపోలేదు. తన తల్లికోరిక మేరకు మాత్రమే కాదు తనకి ఇండస్ట్రీలో నటుడిగా గొప్ప పేరు తెచ్చుకోవాలని కసి ఉండేది. అదే ఆయనని కాంప్రమైజ్ కాకుండా చేసింది. దాంతో మళ్ళీ సినిమాలు చేసి స్టార్ గా మారాడు. ఈ క్రమంలో మొగుడ్స్ –  పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు తగ్గడంతో కొన్ని టీవీ సీరియల్స్ లో నటించారు. ఆయన రాసిన కథలు, కవిత్వాలు పుస్తకాలుగా ప్రింట్ అయ్యాయి.

దాదాపు 300 చిత్రాలకుపైగా నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న రంగనాథ్ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్నారు. కొన్ని అనివార్య కారణాలతో అయన ఆత్మహత్యకు పాల్పడి చనిపోయారు. అయితే ఆయన ఆత్మహత్య తీరు అందర్ని చాలా బాధపెట్టింది. ఇక రంగనాథ్ చనిపోతూ అయన ఇంట్లో పని చేసే మీనాక్షీ అనే అమ్మాయికి ఐదు లక్షల రూపాయిలు ఇవ్వండి అని బొగ్గుతో తన ఇంటి గోడమీద రాసిపెట్టారు రంగనాథ్ గారు. చనిపోయే ముందు వరకూ ఆయనకోసం పని చేసిన వ్యక్తి ఋణం ఉంచుకోకూడదు అనే ఉద్దేశ్యంతో చనిపోయే ముందు అయన అలా రాసినట్టు తెలుస్తుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago