ఈ మధ్య సంచలనం రేపిన రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో శృంగార తార షెర్లీన్ చోప్రా సంచలన విషయాలను బయటపెట్టింది. జూలై 27న విచారణకు హాజరైన ఆమెను అధికారులు ప్రశ్నించగా రాజ్ కుంద్రా లైంగిక వేధింపులను చెప్పి ఆవేదనకు గురైంది. కుంద్రా గురించి చెబుతూ.. అతడు ఎప్పుడూ చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉండేవాడు అనే విషయాలను షెర్లీన్ చోప్రా పేర్కొన్నారు.
అంతేకాకుండా రాజ్ కుంద్రా తనతో పిచ్చి వేషాలు వేసేందుకు ప్రయత్నించాడని.. ఆయన వ్యవహారంతో భయమేసిందని ఆమె విచారణలో భాగంగా చెప్పింది. తనను ఓ రోజు గదిలో బంధించాడని.. ఎలాగోల తప్పించుకొని తాను వాష్ రూమ్ లో దాచుకున్నానని చెప్పింది.
ముద్దు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించినట్లు ఆమె చెప్పింది. నాపై రాజ్ కుంద్రా దారుణంగా వేధింపులకు పాల్పడ్డారు అని షెర్లీన్ చోప్రా తెలిపారు. రాజ్ కుంద్రాపై ఏప్రిల్ 2021లోనే లైంగిక వేధింపుల కేసును నమోదు చేసింది. కుంద్రా, అతడి బిజినెస్ మేనేజర్‌తో మీటింగ్ జరిగింది. ఆ సమయంలోనే నా పేరు (షెర్లీన్ చోప్రా యాప్)తో యాప్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. పోర్న్ కంటెంట్ తో యాప్ ను రిలీజ్ చేద్దాం.. అంటూ తనను బలవంతం కూడా చేసినట్లు ఆమె చెప్పింది.
తాను దీనికి ఒప్పుకోకపోవడంతో తీవ్ర వాదనలు కూడా జరిగాయని ఆమె పేర్కొంది. రాజ్ కుంద్రాకు శిల్పాశెట్టికి మధ్య సంబంధాలు సరిగా లేవని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులకు వెల్లడించింది. ఆమె మార్చి 2021 లోనే పోర్న్ రాకెట్ కేసులో విచారణకు హాజరైంది. సైబర్ సెల్ విభాగంలోని అధికారులకు అన్ని విషయాలు వెల్లడించాను. ఇంకా చెప్పాల్సినవి ఏమీ లేవు అని షెర్లీన్ చోప్రా చెప్పినట్టు సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…