Featured

నాగబాబు నిర్మించిన మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్.. కానీ ఆ సినిమాకు నంది అవార్డ్, నేషనల్ అవార్డ్..!

మెగా బ్రదర్ నాగబాబు తెలుసు కదా. ఆయన మొదట్లో నటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యారు. అప్ కోర్స్.. ఆయన మెగాస్టార్ చిరంజీవి వల్లనే నటుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటికీ.. చిరంజీవి అంత క్రేజ్ ను నాగబాబు సంపాదించలేకపోయారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా స్టార్ హీరో అయ్యారు కానీ.. నాగబాబు మాత్రం ఒక మోస్తారు నటుడిగానే మిగిలిపోయారు.

కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత.. నాగబాబు.. నిర్మాతగా మారారు. నిర్మాతగా తన మొదటి సినిమాను నాగబాబు.. చిరంజీవితోనే తీశారు. కాకపోతే.. నాగబాబుకు ఆ సినిమా కలిసిరాలేదు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. నిజానికి.. ఆ సినిమా సంచలనాలను సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. అందుకే.. నాగబాబు.. ఆ సినిమాకు నిర్మాతగా మారారు. కానీ.. అది ఫ్లాప్ అయిపోయింది. నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో ఆ సినిమా ఒక ప్రయోగం. ఆ ప్రయోగం సక్సెస్ కాలేదు.

ఫ్లాప్ అయినా.. నేషనల్, నంది అవార్డును దక్కించుకున్న చిరంజీవి సినిమా అది

నిజానికి.. సినిమా ఫ్లాప్, హిట్ తో సంబంధం లేకుండా.. సినిమాలోని కథ, నటుల నటనను బట్టి.. అవార్డ్స్ వరిస్తుంటాయి. చాలా సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఎన్నో అవార్డులను గెలచుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి రుద్రవీణ. ఈ సినిమాకు ప్రయోగాత్మకమైందే. ఎందుకంటే.. రుద్రవీణ సినిమా కథ చాలా డిఫరెంట్. అప్పటి వరకు వచ్చిన సినిమాలకు, ఆ సినిమాకు పోలికే ఉండదు. చాలా కొత్త కథ. కానీ.. ప్రేక్షకులు ఆ సినిమాను విజయవంతం చేయలేదు.

డిగ్రీ అయిపోగానే.. అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో చేరిన నాగబాబు

నాగబాబు తన డిగ్రీ అయిపోగానే.. వెంటనే అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో చేరి.. నిర్మాణ పనులు చూసుకునేవారు. అలాగే.. సినిమాల్లోనూ నటిస్తూ ఉండేవారు. అయితే.. నటన కన్నా కూడా నిర్మాణ సంస్థలో నాగబాబుకు మంచి గ్రిప్ రావడంతో.. తనకే సొంతంగా ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయించారు చిరంజీవి. అంజనా ప్రొడక్షన్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. అంజనా అంటే తన తల్లి పేరు. ఆమె పేరు మీదుగా ప్రొడక్షన్ హౌజ్ ను ప్రారంభించారు.

సినిమా ఫ్లాప్ అయినా పాటలు సూపర్ హిట్

కే బాల చందర్ దర్శకత్వంలో వచ్చింది రుద్రవీణ. ఆ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఆ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్టు. ఇప్పటికీ ఈ జనరేషన్ పిల్లలు కూడా ఆ పాటలను విని ఎంజాయ్ చేస్తుంటారు. చిరంజీవి సరసన శోభన నటించింది. ఆ సినిమాలో తమిళ నటుడు జెమిని గణేశన్.. చిరంజీవి తండ్రిగా నటించారు. నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా.. ఫ్లాప్ గా నిలిచింది. కాకపోతే.. ఆ సినిమాకు జాతీయ చలన చిత్ర పురస్కారాలు దక్కాయి. జాతీయ సమైక్యతా చిత్రం అవార్డుతో పాటు.. ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది అవార్డు దక్కింది. అదే సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా.. ఇళయరాజాకు అవార్డు రాగా.. ఉత్తమ గాయకుడిగా.. ఎస్పీ బాలును అవార్డు వరించింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago