తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోలు వాళ్ళ కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడం కోసం మంచి సినిమాలను ఎంచుకుని తన నటన ప్రతిభను కడప చడానికి అహర్నిశలు కష్టపడుతు ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న హీరోల అందరిలో వెంకటేష్ తనదైన శైలిలో పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో వెంకటేష్ చేసిన సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఏ పాత్ర అయిన వెంకటేష్ అలవోకగా చేస్తూ ఉంటారు. అయితే వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ పైన రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన అసురన్ సినిమాకి రీమేక్ గా తెలుగులో నారప్ప పేరుతో రూపొందించారు.
ఈ సినిమాకి దర్శకుడుగా శ్రీకాంత్ అడ్డాల వ్యవహరించారు హీరోయిన్ గా ప్రియమణి నటించింది. అయితే ఈ సినిమా ఈ మధ్య ఓటీటీ ప్లాట్ పైన రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది అనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో వెంకటేష్ పోషించిన నారప్ప పాత్రకి కొడుకు గా నటించిన సీనప్ప ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అవేంటో ఒకసారి మనం తెలుసుకుందాం…
నారప్ప సినిమా విషయానికి వస్తే నారప్ప కొడుకుని కొంతమంది కక్ష కట్టి చంపేస్తారు. ఆ చంపేసిన వాళ్లలో కొందరిని నారప్ప చిన్న కొడుకు అయిన సీనప్ప చంపుతాడు. దాంతో సీనప్పని చంపడం కోసం తిరుగుతున్న రౌడీలను ఎదుర్కోవడమే పని గా పెట్టుకుంటాడు. అలా ఈ సినిమా సాగుతూ ఉంటుంది అయితే ఈ సినిమాలో సీనప్ప పాత్ర పోషించిన నటుడి పేరు గీతాకృష్ణ ఆయన్ని రాఖీ అని కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం రాఖి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తెలుగులో రంగస్థలం లాంటి సినిమాల్లో చిన్న క్యారెక్టర్ పోషించినప్పటికీ అవి ఎడిటింగ్ లో కట్ అయి పోవడం వల్ల సినిమాలో తను పెద్దగా కనిపించలేకుండా పోయాడు. అయితే నారప్ప సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ని పోషించడం తనకు సంతోషంగా ఉందని చెప్పాడు.
నటించేటప్పుడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, హీరో వెంకటేష్ తనకి బాగా సలహాలు ఇస్తూ ఉండేవారని వాళ్ల ప్రోత్సాహం నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ సినిమాలో కొన్ని సందర్భాల్లో వెంకటేష్ నటించిన నటన చూస్తే షూటింగ్ స్పాట్లోనే తన కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేవని అంత బాగా వెంకటేష్ గారు నటించే వారు ఆయనకు నటనంటే పిచ్చి అని చెబుతూ వచ్చాడు. అలా రాఖి వెంకటేష్ గురించి ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.
అలాగే ఈ సినిమాలో సీనప్ప పాత్ర పోషించినందుకు వాళ్ళ అమ్మ నాన్న చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు అని కూడా చెప్పాడు. వెంకటేష్ లాంటి పెద్ద హీరోతో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం అనేది తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను అని కూడా చెప్పాడు. అలా నారప్ప సినిమా గురించి మనసులోని మాటలను తెలుగు ప్రేక్షకుల ముందు పంచుకున్నాడు. అలాగే రాఖి ఇంకా ముందు ముందు మంచి సినిమాల్లో నటిస్తూ తెలుగు లో నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని కోరుకుందాం…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…