బాధలతో బతుకీడ్చడం కన్నా.. నాలుగు గోళీలు మింగి ప్రాణాలు తీసుకోవడం నయం.. కన్న కూతురి బాధను చూస్తున్న తల్లి గుండెకోత నుంచి వచ్చిన మాట అది. పేగు తెంచుకుని లోకాన్ని చూసిన నాటి నుంచి తన కూతురు నరకం అనుభవిస్తోందని షాలిని తల్లి దేవాంకుర్ కంటతడి పెట్టుకున్నారు.
నిజానికి ఆమె కంటి నుంచి రావడానికి ఏమీ లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీరంతా ఆవిరైపోయింది. దేవాంకుర్, రాజ్ బహదూర్‌లు భార్యభర్తలు. వీరి స్వస్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నౌవ్‌గాంగ్ అనే కుగ్రామం. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. వీరికి లేక లేక పుట్టిన సంతానం షాలిని. షాలిని పుట్టుక వారిలో ఆనందాన్ని నింపలేదు. వారి జీవితాలను మరింత బాధల్లోకి నెట్టింది.
కారణం షాలిని శరీరం పాము పొలుసుల్లా ఉండటం. ఆమె శరీరం నుంచి ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి చర్మం రాలిపోయి మళ్లీ వస్తుంటుంది. రోజులో గంటకోసారి స్నానం, మూడు గంటలకోసారి మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను షాలిని శరీరమంతా రాసుకుంటుంది. లేకపోతే పొలుసుల చర్మం తేమ కోల్పోయి మంట పెడుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా గత పదహారేళ్లుగా షాలిని అమ్మ దేవాంకుర్ కూతురిని ఇలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది.
తొలుత ఓ మీడియా సంస్థ షాలిని దురావస్థను వెలుగులోకి తెచ్చింది. దీంతో స్థానిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించగా ఆమె ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. వైద్యం చేయించేందుకు భారీగా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో షాలిని తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి సుడులు తిరిగాయి.
దీంతో ఆసుపత్రి నుంచి వెనుదిరిగి ఇల్లు చేరారు. రెండు రోజుల అనంతరం వారికి ఓ ఫోన్ వచ్చింది. స్పెయిన్‌లోని ఓ ఆసుపత్రి షాలినికి ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకు వచ్చిందనే శుభవార్త తెలిసింది. దీంతో షాలిని ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. షాలిని తర్వాత దేవాంకుర్, రాజ్ బహదూర్ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. వారికి ఎలాంటి సమస్యలు లేవు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…