Featured

ప్రతీసారీ అనుకుంటాను ఈ తప్పు చేయకూడదని : జె.డి.చక్రవర్తి

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా బాగా పాపులర్ నటుడు దర్శకుడు జె.డి చక్రవర్తి. అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్స్‌లో ఉండే ఆయన విద్యను హైదరాబాదు లోని సెయింట్ జార్జ్స్ గ్రామర్ పాఠశాలలో, ఇంజనీరింగ్ విద్యను చైతన్య భారతి కాలేజ్లో పూర్తి చేశాడు. ఇతనికి ఓ గ్యాంగ్ ఉండేది.. చిన్న గొడవలు, ఏదైనా సమస్య ఉంటే సెటిల్ చేయడం లాంటివి చేస్తుండేవాడు. చూడటానికి విలన్ లుక్ కనిపించడం వల్ల కాస్త భయపడేవారని
చెప్పుకునేవారు. అయితే జె.డి.చక్రవర్తికి సినిమాలంటే ఆసక్తి. ఇండస్ట్రీలోకి రావాలని చాలా తాపత్రయం ఉండేది.

దాంతో ఓ సినిమా ఆడిషన్ కి కూడా వెళ్లాడు. కానీ వాళ్ళు జె.డి.చక్రవర్తిని సెలక్ట్ చేయలేదట. దాంతో చాలా బాధపడుతుంటే ఆ ఆడిషన్ చూసిన జె.డి.చక్రవర్తి వాళ్ళ సోదరి.. నువ్వు చాలా బాగా చేశావు.. వాళ్ళు నిన్ను తీసుకోకపోతే అది వాళ్ల బ్యాడ్ లక్ అని సర్ది చెప్పి ఎంకరేజ్ చేసిందట. ఇక జె.డి.చక్రవర్తి మీద కొన్ని రూమర్స్ కూడా బాగా వచ్చేవి. ఆయన అరాచకవాది అని.. ఎప్పుడూ ఒకే మైండ్ సెట్ తో ఉండరని.. ఇలాంటి వాటికి కూడా జె.డి.చక్రవర్తి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతాడు. అయితే రెండింట్లో ఏదైనా ఒకటి కరెక్ట్ అవ్వాలి.. కానీ నాలో రెండు ఉన్నాయంటే ఎలా కుదురుతుంది అని కూడా వాదిస్తుంటాడు.

బయట జనాలలో కొంతమందికి జె.డి.చక్రవర్తి మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంది. అది కూడా మంచిదే అంటాడు. ఇక ప్రపంచంలో ఏ తల్లికైనా బిడ్డ మీద మంచి ఒపీనియనే ఉంటుంది. మా అమ్మకి నా మీద అలానే ఉంది. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం అని జె.డి.చక్రవర్తి చెప్తుంటాడు. ఎదుటి వాడు ఎలా రియాక్ట్ అవుతాడో.. జె.డి.చక్రవర్తి అలా రియాక్ట్ అవుతాడు. ఎప్పటికప్పుడు తనలో ఉండే ఎమోషన్స్ తీర్చేసుకుంటాడు తప్ప అది మనసులో పెట్టుకొని పగ పెంచుకునేవాడు కాదు. అయితే జె.డి.చక్రవర్తి లో ఉన్న చిన్న రెబలిజం అదే రాం గోపాల్ వర్మని మెప్పించింది. ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడే జె.డి.చక్రవర్తి తన ఫ్రెండ్ ద్వారా ఓసారి అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాడు.

తీరా అక్కడికి వెళ్ళి చూస్తే శివ సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఓ పక్కన కూర్చున్న జె.డి.చక్రవర్తి దగ్గరికి తన ఫ్రెండ్ వర్మని తీసుకు వచ్చి పరిచయం చేశాడు. అప్పుడు వర్మ.. ఏమండి మీరేదైనా యాక్ట్ చేసి చూపించండి అన్నారు.. మీరేదైనా సీన్ చెప్పండి అన్నాడు జె.డి.చక్రవర్తి. మళ్ళీ వర్మ అలా కాదండి మీరే ఏదైనా చేయండి.. జె.డి.చక్రవర్తి మళ్లీ మీరే ఏదైనా సీన్ చెప్పండి.. ఇలా ఇద్దరి మధ్య కాస్త ఆర్గ్యూమెంట్ అయింది. ఆ తర్వాత జె.డి.చక్రవర్తి కి వర్మ సీన్ నంబర్ 16 తెప్పించి ఇది ప్రాక్టీస్ చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది.. అన్నాడు. మళ్ళీ జె.డి.చక్రవర్తి అదే యారగెంట్‌గా మీకు ఎప్పటి వరకు కావాలి.

ఇలా అయ్యక రెండు రోజుల తర్వాత వెళ్ళి ఆడిషన్ ఇచ్చాడు. పక్కన ఉన్న వాళ్లని చూసి కంగారు పడ్డ జె.డి.చక్రవర్తి.. మరోసారి ఆడిషన్ ఇమ్మన్నారు. అయితే రెండవసారి ఆడిషన్ ఇవ్వడం కుదరలేదు. అయినా చిన్న ట్విస్ట్ ఇచ్చిన వర్మ ఫైనల్‌గా నాగార్జున శివ సినిమాలో జె.డి.చక్రవర్తిని విలన్ రోల్ కి తీసుకున్నాడు. అలా జె.డి.చక్రవర్తి సినిమా కెరీర్ ప్రారంభం అయింది. ఆ తర్వాత మంచి నటుడిగా హిరోగా, డైరెక్టర్‌గా పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే జె.డి.చక్రవర్తి కెరీర్‌లో ఎంత కష్టపడి సంపాదించుకున్నాడో అంత కష్టపడి అంటే సినిమాలు తీసి.. ఇతర వ్యాపకాలతో పోగొట్టుకుంటాడు. డబ్బు పోగొట్టుకునే అలవాటు ఎంత మానేయాలనుకున్నా మానలేక పోతున్నాడట జె.డి.చక్రవర్తి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago