ఫేస్ బుక్ వాడకం రోజు రోజుకీ పెరిగిపోవడంతో… ఫేస్ బుక్ తన వినియోగదారుల కోసం ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇప్పటి వరకు మనకు మెసేజ్ పోస్టులు, వీడియోలు షేర్ చేయడం వరకే పరిమితమైన ఫేస్ బుక్ లో ఇప్పుడు కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఓలెక్స్ తరహాలో వినియోగించిన వస్తువులను కొనడానికి.. అమ్మడానికి అవకాశం కల్పిస్తోంది. ‘మార్కెట్‌ప్లేస్’ అనే పేరుతో ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌పై ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ఇండియాలో ట్రయల్‌గా ముందు ముంబైలో చేపట్టింది. ఇది కానీ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా దీన్ని లాంచ్ చేయబోతుంది. ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ ఓలెక్స్, క్వికర్ తరహాలో ఫేస్‌బుక్ కూడా ఈ సేవలను అందిస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ 25 దేశాల్లో అందుబాటులో ఉంది.
ఇటీవలే ఈ ఫీచర్ ను జర్మనీ, ఫ్రాన్స్, యూకే వంటి 17 దేశాల్లో దీన్ని ప్రారంభించారు. ఫేస్‌బుక్‌కు భారీ మొత్తంలో యూజర్ డేటాబేస్ ఉంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్ తన పేజీలో మార్కెట్ ప్లేస్ అనే కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌తో యూజర్లను మరింత మందిని ఆకట్టుకోనుంది. అందులోకి వెళ్లి మీరు అమ్మాలనుకుంటున్న లేదా కొనాలనుకుంటున్న వస్తువుల ఫొటోలు పెట్టి వాటి వివరాలు రాయాలి. అది చూసి నచ్చినవారు అక్కడే ఛాటింగ్ లేదా కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. గృహోపరికరాలు, ఎలక్ట్రానిక్స్, అప్పారెల్స్ వంటి అన్ని కేటగిరీ సంబంధించిన వస్తువులను దీనిలో కొనుగోలు చేసుకోవడానికి, అమ్మడానికి అవకాశం కల్పించనుంది. అయితే ఇందులో పేమెంట్‌కు, డెలివరీకి మాత్రం ఫేస్‌బుక్ బాధ్యత కాదు. ఇందులో అభ్యంతరకమైన వస్తువులను అమ్మకానికి పెట్టడానికి వీలులేకుండా మెషీన్ లెర్నింగ్ సాంకేతికతను వాడుతున్నారు..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…